Tunnel Collapse In Dominican Republic : సొరంగం సిమెంట్ గోడ కూలి డొమినికన్ రిపబ్లిక్‌లో 9 మంది మృతిచెందారు. ఈ ఘటన శాంటో డోమింగ్ ప్రాంతంలో జరిగింది. భారీ వర్షాలు, వరదల కారణంగా సొరంగం గోడ కూలినట్లు అధికారులు తెలిపారు. వాహనాలు వేగంగా వెళ్లేందుకు నిర్మించిన ఈ సొరంగం గోడ కూలి... ఆ మార్గంలో ప్రయాణిస్తున్న కార్లు, ఇతర వాహనాలపై పడింది. అనేక కార్లు లోపలే చిక్కుకుపోవడం వల్ల అత్యవసర బృందాలు రంగంలోకి దిగాయి. గోడ కూలడం వల్ల లోపల నిర్మించిన పైప్‌లైన్లు పగిలి సొరంగం నీటితో నిండిపోయింది. ఆ నీటి వల్ల సహాయ చర్యలకు విఘాతం కలుగుతోంది. ఇప్పటివరకు 9 మృతదేహాలను బయటకు తీసినట్లు అధికారులు తెలిపారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో ఐదుగురు పురుషులు, నలుగురు మహిళలు ఉన్నట్లు చెప్పారు.




రోడ్డు నిర్మాణంలో ప్రమాదం.. ఐదుగురు మృతి
Mexico Construction Accident Today : సెంట్రల్ మెక్సికోలో చేపట్టిన రోడ్డు నిర్మాణంలో ప్రమాదం జరిగి ఐదుగురు కార్మికులు మరణించారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. రోడ్డు నిర్మాణంలో ఉపయోగించే 50 అడుగుల పొడవైన ఓ భారీ పరికరం కూలడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై రిటైనింగ్ గోడ నిర్మాణానికి సిమెంట్ పోస్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాద స్థలంలో ఉన్న మిగిలిన సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారని అధికారులు తెలిపారు. ఈ నిర్మాణాన్ని ఓ ప్రైవేట్ సంస్థ చేపట్టిందని.. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. మెక్సికోలో పని ప్రదేశంలో సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్ల ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు.
లండన్లో ఒకే కుటుంబంలోని ఐదుగురు భారతీయులు మృతి
Indian Family Dead In London : ఇటీవల దీపావళి వేడుకలు చేసుకుంటుండగా అగ్నిప్రమాదం సంభవించి భారత సంతతికి చెందిన ఐదుగురు కుటుంబసభ్యులు మరణించారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉండగా.. ప్రమాదంలో మరో వ్యక్తి గాయపడ్డారు. ఈ ఘటన బ్రిటన్ రాజధాని లండన్లో జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.