ETV Bharat / international

'నువ్వు హీరోవీ బయటకి రా'.. శిథిలాల కింద చిక్కుకున్న చిన్నారులను కాపాడిన రెస్క్యూ టీమ్.. ​ - తుర్కియే లేటెస్ట్ న్యూస్

భూకంపం ధాటికి కకావికలమైన సిరియాలో అద్భుతం జరిగింది. భవనాల శిథిలాల కింద కొన్ని గంటల పాటు చిక్కుకున్న చిన్నారులను సహాయక సిబ్బంది రక్షించారు. ఒకే పట్టణంలోని రెండు వేర్వేరు భవనాల శిథిలాల నుంచి చిన్నారులను సురక్షితంగా బయటకు తీశారు. మృత్యుంజయులుగా బయటికి వచ్చిన ఆ చిన్నారులను చూసి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.

syria earthquake 2023 news
syria earthquake 2023 news
author img

By

Published : Feb 7, 2023, 10:45 PM IST

భారీ భూకంపానికి ఉక్కిరిబిక్కిరి అయిన సిరియాలో హృదయాలను ద్రవింపజేసే దృశ్యాలు కనిపిస్తున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించడం కోసం సహాయక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. భవనాలు పేకమేడల్లా కూలిపోగా ఆ శిథిలాల్లో అణువణువూ గాలిస్తున్నారు. వాయవ్య సిరియాలోని జిందెరిస్ పట్టణంలో ఓ భవనం శిథిలాల్లో చిక్కుకున్న ఇద్దరు చిన్నారులను రెస్క్యూ సిబ్బంది సురక్షితంగా బయటికి తీశారు.

నూర్‌ అనే చిన్నారి ఆచూకీ కోసం ఆమె తండ్రి భవన శిథిలాల కింద గాలించాడు. రెస్క్యూ సిబ్బందికి సమాచారం ఇవ్వగా వారు సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద నూర్ జాడ కనిపెట్టిన సహాయక సిబ్బంది.. ఆ చిన్నారికి ధైర్యం కల్పించారు. తన తండ్రి అక్కడే ఉన్నాడని.. అతనితో మాట్లాడాలని సూచించారు. నూర్‌ తండ్రి పక్కనే ఉండగా శిథిలాల నుంచి చిన్నారిని సహాయక సిబ్బంది సురక్షితంగా బయటికి తీశారు. దీంతో నూర్‌ కుటుంబ సభ్యులతోపాటు సహాయక సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.

అదే జిందెరిస్‌ పట్టణంలో హరూన్ అనే బాలుడిని రెస్క్యూ సిబ్బంది ప్రాణాలతో బయటికి తీశారు. శిథిలాల కింద ప్రాణ భయంతో ఉన్న హరూన్‌ను కాపాడారు. 'హరూన్‌ నువ్వు ఒక హీరోవి బయటికి రా' అని ప్రోత్సహించారు. రాత్రి వేళ చిమ్మచీకటిలో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న హరూన్‌ను సురక్షితంగా బయటికి తీశారు.

మరోవైపు అంటక్యాలో కూలిపోయిన భవన శిథిలాల కింద తన తల్లి స్వరం వినిపించిందని చెప్పింది ఓ మహిళ. కానీ ఆమెను కాపాడేందుకు రెస్క్యూ సిబ్బంది చేసిన ప్రయత్నాలు ఫలించలేదని ఆవేదన వ్యక్తం చేసింది. తన తల్లికి 70 సంవత్సరాలని.. ఎక్కువ సేపు ఆమె అక్కడ ఉండలేదని ఆందోళన వ్యక్తం చేసింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.