ETV Bharat / international

నాటోలో చేరుతున్న ఫిన్లాండ్​, స్వీడన్.. టర్కీ అభ్యంతరం చెప్పినా.. - నాటో

Sweden Finland: నాటోలో చేరేందుకు అధికారిక ప్రక్రియ ప్రారంభించాయి స్వీడన్, ఫిన్లాండ్. దరఖాస్తు పత్రంపై సంతకాలు చేశాయి. దీన్ని బ్రస్సెల్స్​లోని నాటో ప్రధాన కార్యాలయంలో అందజేయనున్నాయి. అయితే వీటి చేరికను వ్యతిరేకిస్తున్న టర్కీ.. అడ్డుపడుతుందా? లేదా? అనే విషయం ఆసక్తికరంగా మారింది.

Sweden, Finland push ahead with NATO bids as Turkey objects
నాటోలో చేరేందుకు ఫిన్లాండ్​, స్వీడన్ ముందడుగు
author img

By

Published : May 18, 2022, 1:48 PM IST

Sweden Finland NATO: నాటోలో చేరేందుకు నార్డిక్ దేశాలు ఫిన్లాండ్​, స్వీడన్ మరో ముందడుగు వేశాయి. రెండు దేశాలు నాటో దరఖాస్తు పత్రంపై సంతకాలు చేశాయి. దీన్ని బ్రస్సెల్స్​లోని నాటో ప్రధాన కార్యాలయంలో బుధవారమే అందజేయనున్నాయి. టర్కీ అభ్యంతరం చెబుతున్నప్పటికీ ఈ రెండు దేశాలు అధికారిక ప్రక్రియతో ముందుకు సాగుతున్నాయి. రష్యా ఉక్రెయిన్​పై దండయాత్ర చేయడం వల్ల భయంతోనే ఫిన్లాండ్, స్వీడన్ నాటోలో చేరేందుకు తహతహలాడుతున్నాయని టర్కీ అధ్యక్షుడు రికెప్ తయ్యిప్ ఎర్డగాన్ ఇటీవల ఆరోపించారు. సోమవారం మరోమారు ఇదే విధంగా స్పందించారు. ఈ నేపథ్యంలో ఫిన్లాండ్, స్వీడన్​ నాటాలో చేరకుండా టర్కీ అడ్డుపడుతుందా? అనే విషయం ఆసక్తికరంగా మారింది.

Turkey President: ఏదైనా కొత్త దేశం నాటోలో చేరాలంటే అందులోని 30 సభ్య దేశాల ఆమోదం తప్పనిసరి. ఏ ఒక్క దేశం ఒప్పుకోకపోయినా కొత్త దేశం నాటోలో చేరలేదు. అయితే అమెరికా సహా నాటోలోని చాలా దేశాలు ఫిన్లాండ్, స్వీడన్​ను స్వాగతిస్తున్నాయి. టర్కీ మాత్రం అభ్యంతరం తెలుపుతోంది. ఈ రెండు దేశాలు కుర్దీస్థాన్‌ వర్కర్స్‌ పార్టీ (పీకేకే) మిలిటెంట్లకు ఆశ్రయం కల్పిస్తున్నాయని ఆరోపిస్తోంది.

అయితే ఏప్రిల్​లో ఎర్డగాన్​తో మాట్లాడిప్పుడు నాటోలో చేరేందుకు అభ్యంతరం ఏమీ చెప్పలేదని ఫిన్లాండ్ అధ్యక్షుడు సాలి నినిస్టో తెలిపారు. ఆయన ఇప్పుడు ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. ఏమైనా సమస్యలుంటే చర్చించి పరిష్కరించుకుంటామని అన్నారు. స్వీడన్ ప్రధాని మాగ్డలేనా అండర్సన్​ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. టర్కీతో తాము ఇప్పటికీ సంప్రదింపులు జరుపుతున్నామని సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకుంటామన్నారు. ఐరోపా సమాఖ్య అధికారులు కూడా ఈ సమస్య పరిష్కృతమవుతుందని భావిస్తున్నారు. ఫిన్లాండ్​, స్వీడన్ నాటోలో చేరేందుకు ఎలాంటి అడ్డంకులు ఉండబోవని విశ్వసిస్తున్నారు.

నాటోలో చేరాలానే నిర్ణయానికి ఫిన్లాండ్ పార్లమెంట్​ శనివారమే అధికారిక ఆమోద ముద్ర వేసింది. 188-8 ఓట్ల తేడాతో తీర్మానం పార్లమెంటులో నెగ్గింది. దీంతో ఫిన్లాండ్, స్వీడన్ సంయుక్తంగా నాటో దరఖాస్తుపై సంతకాలు చేశాయి.

బైడెన్​తో భేటీ: మరోవైపు నాటోలో చేరేందుకు సిద్ధమైన స్వీడన్, ఫిన్‌లాండ్ దేశాధినేతలతో అగ్రరాజ్యాధినేత జో బైడెన్ భేటీ కానున్నారు. వైట్‌హౌస్ వేదికగా గురువారం స్వీడన్ ప్రధాని మాగ్డెలినా అండర్సన్, ఫిన్‌లాండ్ అధ్యక్షుడు సౌలి నినిస్టోలతో బైడెన్ సమావేశం కానున్నట్లు శ్వేతసౌధం వర్గాలు వెల్లడించాయి. నాటోలో చేరేందుకు రెండు దేశాల ప్రతిపాదనపై నేతలు చర్చించనున్నట్లు తెలిపాయి. వీటితో పాటు ఐరోపాలో భద్రతపై సమాలోచనలు చేస్తారని శ్వేతసౌధం వర్గాలు వెల్లడించాయి. రెండు దేశాలు నాటో కూటమిలో చేరటానికి సంబంధించి ఒక ఒప్పందం కుదరవచ్చని వైట్‌హౌస్ విశ్వాసం వ్యక్తం చేసింది. స్వీడన్, ఫిన్‌లాండ్ దేశాధినేతలతో సమావేశం అనంతరం బైడెన్.. దక్షిణ కొరియా, జపాన్ పర్యటనకు వెళ్లనున్నట్లు తెలిపింది.

ఇదీ చదవండి: Ukraine Crisis: నాటో సభ్యత్యంపై బేరాలు.. స్వీడన్​, ఫిన్లాండ్​కు టర్కీ షాక్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.