Srilanka President Ranil Vikramsinghe Oath: శ్రీలంక ఎనిమిదో అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘె (73) గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంటు కాంప్లెక్స్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జయంత జయసూర్య సమక్షాన ఆయన ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా అక్కడ అత్యంత కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటుచేశారు.
త్రివిధ దళాల అధిపతులు, స్పీకర్ మహింద యాప అబేవర్ధన తదితరులు పాల్గొన్నారు. విక్రమసింఘె శుక్రవారం 20-25 మందితో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయనున్నారు. రాజపక్స కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన దినేశ్ గుణవర్ధన(73) ప్రధానమంత్రి బాధ్యతలు చేపడతారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
గొటబాయకు సింగపూర్ సందర్శక వీసా
శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్సకు ప్రైవేటు పర్యటన నిమిత్తం 14 రోజుల సందర్శక వీసాను మంజూరు చేసినట్టు సింగపూర్ వలసల విభాగం అధికారులు తెలిపారు.
ఇవీ చదవండి: ఇటలీ ప్రధాని రాజీనామా.. 17 నెలలకే ముగిసిన పాలన.