ETV Bharat / international

'డర్టీబాంబు' అంటే ఏంటి?.. ఎప్పుడైనా ప్రయోగించారా? ప్రాణ ముప్పు తప్పదా? - ఉక్రెయిన్ రష్యా సంక్షోభం

Dirty Bomb News : రష్యా- ఉక్రెయిన్ యుద్ధంలో తాజాగా ఎక్కువగా వినిపిస్తున్న పదం డర్టీబాంబు. ఇరుదేశాలు ఈ బాంబును సిద్ధం చేసుకుంటున్నాయని ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. అసలేంటీ డర్టీబాంబు? గతంలో ఎప్పుడైనా ఈ బాంబును ప్రయోగించారా?

dirty bomb
డర్టీ బాంబు
author img

By

Published : Oct 27, 2022, 7:50 AM IST

Dirty Bomb News : రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంలో తాజాగా వినిపిస్తున్న పదం డర్టీబాంబు! మీరు సిద్ధం చేస్తున్నారంటే మీరే చేస్తున్నారంటూ పరస్పరం ఆరోపణలు గుప్పించుకుంటున్నారీ బాంబు గురించి! దీంతో యుద్ధం క్రమంగా అణు అంచులకు చేరుతోందంటూ ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఏమిటీ డర్టీబాంబు? గతంలో ఎప్పుడు ఉపయోగించారు? ఏం చేస్తుందిది అని చూస్తే..

ఇప్పటి దాకా చరిత్రలో ఎన్నడూ డర్టీ బాంబును ప్రయోగించిన దాఖలాలు లేవు. 20 ఏళ్ల కిందట రష్యా దక్షిణ ప్రాంతమైన చెచెన్యాలో రెండుసార్లు వీటిని పేల్చటానికి విఫలయత్నం జరిగినట్లు చెబుతారు. ఇజ్రాయెల్‌ కూడా 2015లో ప్రయోగాత్మకంగా డిమోనా అణురియాక్టర్‌ వద్ద దీన్ని చేసి చూసిందని గతంలో వార్తలు వచ్చాయి. అల్‌ఖైదా ఉగ్రవాదుల వద్ద ఈ డర్టీ బాంబు తయారీకి సంబంధించిన పదార్థాలను గతంలో అమెరికా, బ్రిటన్‌లు పట్టుకున్నాయి.

డర్టీబాంబు అనేది అణుధార్మిక పదార్థంతో కూడుకున్నదే. కానీ ఇదేమీ పూర్తిస్థాయి అణుబాంబు కాదు. అణుబాంబులా గొలుసు చర్య ఉండదు. అణుధార్మిక ధూళి, పొగను వాతావరణంలోకి విడుదల చేసి భయాందోళలను కల్గించటానికి వినియోగించేది. అణ్వస్త్రాల కంటే కూడా చాలా సులభంగా, తక్కువ ధరలో వీటిని తయారు చేయొచ్చు. అణుధార్మిక పదార్థాలతో కలిపి డైనమైట్‌లాంటి పేలుడు పదార్థాలనే వీటిలోనూ ఉపయోగిస్తారు. పేలుడు తీవ్రతను బట్టి ఆ అణుధార్మిక పదార్థం వాతావరణంలో విస్తరిస్తుంది. ఈ పదార్థం ప్రమాదకరమైందేగాని మరీ ప్రాణాంతకం ఏమీ కాదు. వైద్యం, పరిశ్రమలు, పరిశోధన కేంద్రాల్లో వాడే వాటి పదార్థాల నుంచే డర్టీబాంబుల్లో వాడే అణుధార్మికతను సేకరిస్తారు.

ఈ బాంబు ద్వారా నష్టం ఎంత ఉంటుందనేది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఇందులో పేలుడుకు వాడే పదార్థం ఎలాంటిదనేది తీవ్రతను నిర్ణయిస్తుంది. ఎలాంటి, ఎంత అణుధార్మిక పదార్థాన్ని వాడారు.. పేలుడు సమయంలో వాతావరణం ఎలా ఉంది? ముఖ్యంగా గాలులెటువైపు వీస్తున్నాయి అనేవి అన్నీ కీలకమే. వాయువు ఎటువైపు వీస్తుంటే ఆ దిశగా అణుధార్మిక ధూళి విస్తరిస్తుంది. ఈ ధూళితో దూరంగా ఉన్నవారిలో పెద్దగా లక్షణాలేమీ కనిపించవు. ఎందుకంటే దూరంగా వెళ్లిన కొద్దీ వాతావరణంలో అణుధార్మిక పదార్థం విస్తరించి గాఢత కోల్పోతుంది. తక్కువ ప్రమాదకారకం అవుతుంది. పేలుడు జరిగిన చోటుకు దగ్గరున్నవారికి మాత్రం ప్రమాదకరమే. ఈ రేడియేషన్‌ ప్రభావాన్ని అంచనా వేయటానికి ప్రత్యేక పరికరాలు అవసరం అవుతాయి. రేడియేషన్‌కు గురైన ఇళ్లు, కార్యాలయాలు.. తదితర ప్రాంతాలను శుభ్రం చేయటం అత్యంత ఖరీదుతో కూడుకున్న వ్యవహారం.

  • ఈ డర్టీబాంబుతో విధ్వంసం కంటే భయాన్ని నింపుతారు. ఇదో మానసిక ఆయుధం. యుద్ధరంగంలో కంటే.. పట్టణ ప్రాంతాలపై దీన్ని ప్రయోగిస్తారు. దీంతో ఆయా పట్టణాలను కొన్ని సంవత్సరాల పాటు ఖాళీ చేయాల్సి వస్తుంది. ఇది ఆర్థికంగా ఎంతో నష్టం కల్గించే ప్రక్రియ.
  • ఇప్పుడు ఈ డర్టీబాంబులను ఉక్రెయిన్‌ తయారుచేస్తోందని.. దాన్ని ఉపయోగించి తమపై నిందమోపేందుకు ప్రయత్నిస్తుందనేది రష్యా ఆరోపణ. ఉక్రెయిన్‌ కూడా రష్యాపై ఇలాంటి ఆరోపణే చేస్తోంది.

ఇవీ చదవండి: రిషి సునాక్‌ను అభినందించని పుతిన్‌.. కారణం ఏంటంటే?

పుతిన్ పర్యవేక్షణలో రష్యా 'అణు ప్రయోగాలు'​.. అదే పరిష్కారం కాదన్న రాజ్​నాథ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.