Russia Ukraine News: ఉక్రెయిన్‌పై సైనికచర్యకు వ్యతిరేకంగా ఆంక్షలు విధించిన నేపథ్యంలో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ సహా భారత సంతతికి చెందిన మంత్రులు, పలువురు రాజకీయ నేతలపై రష్యా నిషేధం విధించింది. మొత్తం 13మంది పేర్లతో మాస్కో స్టాప్ లిస్ట్ జారీ చేసింది. ఇందులో భారత సంతతికి చెందిన బ్రిటన్ మంత్రులు రిషి సునక్, ప్రీతి పటేల్, అటార్నీ జనరల్ బ్రవర్‌మన్, ఉప ప్రధానమంత్రి డొమినిక్ రబ్, విదేశాంగమంత్రి లిజ్ ట్రస్, రక్షణ మంత్రి బెన్‌వాలెస్ ఉన్నారు.
భవిష్యత్తులో బ్రిటన్‌కు చెందిన మరికొందరు రాజకీయ నేతలు, పార్లమెంటు సభ్యులను కూడా చేర్చనున్నట్లు రష్యా విదేశాంగ శాఖ ప్రకటించింది. తమ దేశాన్ని అంతర్జాతీయంగా ఏకాకిని చేయటం, దేశీయ ఆర్థిక వ్యవస్థను కట్టడి చేసే పరిస్థితులను సృష్టించేందుకు బ్రిటన్ చేపట్టిన చర్యలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు రష్యా విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
ఇదీ చదవండి: 'శత్రువులు చాలా క్రూరులు.. కీవ్‌కు అప్పుడే రావొద్దు'