ETV Bharat / international

'ఉక్రెయిన్ సంక్షోభానికి చర్చలే పరిష్కారం'.. పుతిన్​కు మోదీ సూచన

Modi Putin Ukraine War : రష్యా అధ్యక్షుడు పుతిన్​తో భారత్ ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్​లో సంభాషించారు. ద్వైపాక్షిక సహకారంలో పురోగతిని ఇరువురు నేతలు సమీక్షించారు. చర్చలు, దౌత్య మార్గం ద్వారా ఉక్రెయిన్‌ యుద్ధానికి పరిష్కారం కనుగొనాలని పుతిన్​కు మోదీ సూచించారు.

modi-putin-phone-call-pm-modi-reiterates-call-for-dialogue-diplomacy-to-resolve-ukraine-crisis
పుతిన్​కు మోదీ ఫోన్​ కాల్​
author img

By

Published : Jun 30, 2023, 9:44 PM IST

Modi Putin Phone Call : ఉక్రెయిన్‌ యుద్ధానికి చర్చలు, దౌత్య మార్గం ద్వారా పరిష్కారం కనుగొనాలని ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి పిలుపునిచ్చారు. భారత్‌ అధ్యక్షతన షాంఘై సహకార సంస్థ వర్చువల్‌ సదస్సు జరగనున్న వేళ రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మోదీ ఫోన్‌లో మాట్లాడారు. ద్వైపాక్షిక సహకారంలో పురోగతిని ఇరువురు నేతలు సమీక్షించారు. పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపై అభిప్రాయాలను పంచుకున్నారు.

రష్యాలో ఇటీవలి పరిణామాల గురించి పుతిన్.. మోదీకి తెలియజేసినట్లు ప్రధాన మంత్రి కార్యాలయం తెలిపింది. ప్రత్యేక, వ్యూహాత్మక ద్వైపాక్షిక బంధాన్ని బలోపేతం చేసుకునేందుకు నిబద్ధతతో ఉండాలని ఇరువురు నేతలు నిర్ణయం తీసుకున్నారని తెలిపింది. తరచుగా సంప్రదింపులు జరుపుకోవాలని నిర్ణయించినట్లు పేర్కొంది. మరోవైపు, ఉక్రెయిన్‌తో పోరుకు సంబంధించిన వివరాలను మోదీకి పుతిన్‌ వివరించినట్లు రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్‌ తెలిపింది. సమస్యకు దౌత్యమార్గంలో పరిష్కారం కనుగొనేందుకు ఉక్రెయిన్‌ అంగీకరించడం లేదనే విషయాన్ని మోదీ దృష్టికి పుతిన్‌ తీసుకువెళ్లినట్లు క్రెమ్లిన్‌ వెల్లడించింది. గతవారం రష్యాపై వాగ్నర్​ గ్రూప్ చేపట్టిన తిరుగుబాటును నివారించేందుకు పుతిన్ తీసుకున్న చర్యలకు.. మోదీ మద్ధతు పలికినట్లు క్రెమ్లిన్​ తెలిపింది.

కాగా, జూన్​ నాలుగో తేదీన షాంఘై కో-ఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌ (ఎస్‌సీవో) కౌన్సిల్‌ ఆఫ్‌ హెడ్స్‌ 23వ సమావేశం​ జరగనుంది. వర్చువల్‌గా జరిగే ఈ సమ్మిట్​కు భారత్ అధ్యక్షత వహించనుంది. ఈ సమావేశానికి చైనా అధ్యక్షుడు జిన్​పింగ్​, రష్యా అధ్యక్షుడు పుతిన్​తో పాటు ఇతర నేతలు హాజరుకానున్నారు. షాంఘై కో-ఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌ అనేది ఆర్థిక, భద్రతా కూటమి మాత్రమే కాకుండా అంతర్జాతీయ సంస్థలలో ఒకటి. 2001లో రష్యా, చైనా, కిర్గిస్థాన్‌, కజకిస్థాన్‌, ఉజ్బెకిస్థాన్‌, తజకిస్థాన్‌ అధ్యక్షులతో షాంఘైలో జరిగిన శిఖరాగ్ర సమావేశంలో ఈ ఎస్‌సీవో మొదలైంది. భారత్‌, పాకిస్థాన్‌ 2017 నుంచి ఇందులో శాశ్వత సభ్యదేశాలుగా ఉన్నాయి. ఏటా వివిధ దేశాల అధ్యక్షత ఈ సమావేశం జరుగుతుండగా.. ఈ సారి ఆ బాధ్యతలను భారత్ తీసుకుంది.

రష్యా-ఉక్రెయిన్ సమస్య పరిష్కారానికి అదొక్కటే మార్గం: నరేంద్ర మోదీ..
ఉక్రెయిన్-రష్యా యుద్ధ పరిష్కారానికి చర్చలు, దౌత్యమే మార్గమని.. ఉక్రెయిన్​ యుద్ధం ప్రారంభం నుంచే నరేంద్ర మోదీ చెబుతూ వస్తున్నారు. మే నెలలో హిరోషిమాలో జీ-7 శిఖరాగ్ర సదస్సులో కూడా ఉక్రెయిన్​-రష్యా యుద్ధం గురించి ప్రధాని మోదీ మాట్లాడారు. ఉక్రెయిన్​-రష్యా యుద్ధం మానవత్వం, మానవీయ విలువలకు సంబంధించిన సమస్య అని తాను నమ్ముతున్నానని ఆ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితిని రాజకీయాలు లేదా ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన సమస్యగా తాను పరిగణించనని పేర్కొన్నారు. ప్రపంచంలో ఎక్కడైనా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడితే.. ఆ ప్రభావం అభివృద్ధి చెందుతున్న దేశాలపై ఎక్కువగా పడుతుందని హిరోషిమాలో జీ-7 శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోదీ వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.