జో బైడెన్..అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు. చిటికేస్తే చాలు కావాల్సినవన్నీ ఆయన ఎదుట వాలతాయి. కానీ, ఆయన ఓ సాధారణ వ్యక్తిగా రెస్టారెంట్‌కి వెళ్లి 'క్వెసిడిలస్' అనే వంటకాన్ని ఆర్డర్ చేశారు. ప్రజలకు సేవ చేస్తున్నారన్న కారణంతో రెస్టారెంట్ యాజమాన్యం ఆయనకు 50శాతం డిస్కౌంట్ కూడా ఇచ్చింది. బైడెన్ రెస్టారెంట్‌కి వెళ్లడం ఏంటి? ఆయనకు డిస్కౌంట్ ఇవ్వడమేంటి అనుకుంటున్నారా? ఇది నిజమే. లాస్ ఏంజిల్స్‌లోని ఓ రెస్టారెంట్‌లో క్యాషియర్, బైడెన్ మధ్య సంభాషణ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.
అమెరికాలో మెక్సికన్ వంటకాలను బాగా ఇష్టపడతారు. టాకోస్, బుర్రిటోస్, క్వాసిడిలస్ అంటే అక్కడి వారు చెవికోసుకుంటారు. దానికి తాను కూడా అతీతుడ్ని కాదని నిరూపించారు జో బైడెన్. లాస్ ఏంజిల్స్ వెళ్లిన ఆయన టాకోస్ 1989 అనే మెక్సికన్ రెస్టారెంట్ ముందు ఆగారు. లోపలికి వెళ్లి.. క్వాసిడిలస్ అనే వంటకాన్ని ఆర్డర్ చేశారు. అది కూడా ఆయన కోసం కాదు. ప్రస్తుతం లాస్ ఏంజిల్స్ మేయర్ పదవి కోసం పోటీపడుతున్న కరేన్ బాస్ కోసమట. క్యాషియర్ ఆ వంటకాన్ని బైడెన్‌కు అందించాడు.
ఎంతయ్యింది? అని బైడెన్ అడగ్గా.. 50శాతం డిస్కౌంట్ పోనూ 16.45 డాలర్లు అయ్యిందని చెప్పాడు. దీంతో బైడెన్ 60 డాలర్లు ఇచ్చి.. మిగతా మొత్తంతో తరువాత వచ్చిన వారికి ఉచితంగా ఇవ్వమని చెప్పారు. ఈ సంభాషణను బైడెన్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు. 'మీకు క్వాసిడిలస్ ఉచితంగా దొరికినట్లయితే.. నాకు తెలియజేయండి' అంటూ క్యాప్షన్ కూడా పెట్టారు. ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది.
-
If you got the next quesadilla, let me know. pic.twitter.com/gLJGs98jME
— President Biden (@POTUS) October 14, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">If you got the next quesadilla, let me know. pic.twitter.com/gLJGs98jME
— President Biden (@POTUS) October 14, 2022If you got the next quesadilla, let me know. pic.twitter.com/gLJGs98jME
— President Biden (@POTUS) October 14, 2022