ETV Bharat / international

బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్​ ధర ఒకేసారి రూ.84 పెంపు.. ఎక్కడంటే... - డీజిల్​ ధరలు

Fuel Price Hike: ఇంధన ధరలు భారీగా పెరగనున్నాయి! ఒకేసారి.. లీటర్​ పెట్రోల్​పై రూ. 83.5, డీజిల్​పై రూ.119 పెంపు శనివారం నుంచి అమలు కానుంది. అయితే ఈ బాదుడు మన భారత్​లో కాదు.. పాకిస్థాన్​లో. ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది అక్కడి ప్రభుత్వం.

Fuel Price Hike
Fuel Price Hike
author img

By

Published : Apr 15, 2022, 1:49 PM IST

Updated : Apr 15, 2022, 2:35 PM IST

Fuel Price Hike: క్షీణించిన ఆర్థిక వ్యవస్థతో సతమతమవుతున్న పాకిస్థాన్​ ప్రజలపై ఇప్పుడు మరింత భారం పడే అవకాశం ఉంది. దేశ ఆర్థిక వ్యవస్థను దృష్టిలో పెట్టుకుని ఆయిల్​ అండ్​ గ్యాస్​ అథారిటీ (ఓజీఆర్​ఏ) సూచనల మేరకు ఇంధన ధరలను పెంచాలని భావిస్తోంది షెహబాజ్​ షరీఫ్​ ప్రభుత్వం. శనివారం నుంచి ఈ కొత్త ధరలు అమలులోకి వస్తాయని, ఇందులో భాగంగా లీటరు పెట్రోల్​పై రూ. 83.5, డీజిల్​పై రూ.119 పెరిగే అవకాశం ఉందని సమాచారం.

ఇతర చమురు ఉత్పత్తులపైన కూడా ధరలు భారీగా పెరగనున్నాయి. లైట్​ డీజిల్​పైన రూ.77.31, కిరోసిన్​పైన రూ.36.5 పెంచాలని భావిస్తోంది పాక్​ ప్రభుత్వం. ఈ ధరలు అమలైతే పాక్​ ప్రజలకు ఇంధనం మరింత భారంగా మారుతుంది. ప్రస్తుతం పాకిస్థాన్​లో పెట్రోల్​, డీజిల్​పై 17 శాతం జీఎస్​టీ వసూలు చేస్తుండగా దీనిని 70 శాతానికి పెంచాలని ఓజీఆర్​ఏ ప్రతిపాదించింది. ఈ ధరలపై ప్రధాని షెహబాజ్​ షరీఫ్​ను సంప్రదించాక తుది నిర్ణయం తీసుకోనున్నట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది.

అంధకారంలోనే.. పాక్​ ప్రజలను కరెంటు కష్టాలు వెంటాడుతున్నాయి. కరాచీలో లోడ్​ షెడ్డింగ్​ సమస్య కారణంగా నగరానికి సరిపడా విద్యుత్​ను సరఫరా చేయలేకపోతున్నారు అధికారులు. ఫలితంగా కరాచీలోని చాలా ప్రాంతాల ప్రజలు అంధకారంలోనే గడుపుతున్నారు. కోరంగీ, లంధీ, రైల్వే కాలనీ, నుస్రత్​ భుట్టో కాలనీ, ఖ్వాజా అజ్మేర్​ నగ్రీ, పాపోష్​ నగర్, లియాకత్​ మార్కెట్, మలిర్, గులిస్తాన్-ఇ-జౌహార్​ మొదలైన ప్రాంతాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. పవిత్ర రంజాన్​ మాసంలో ప్రార్థనలు కూడా చీకట్లోనే చేసుకోవాల్సి వస్తోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి: రష్యాకు అనూహ్య నష్టం.. భారీ యుద్ధనౌక ధ్వంసం

Last Updated : Apr 15, 2022, 2:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.