ETV Bharat / international

వేలంలో రూ.7 కోట్లు పలికిన హార్లీ డేవిడ్​సన్ బైక్.. అంత స్పెషల్ ఎందుకంటే?​ ​ - హార్లీ డేవిడ్​సన్ బైక్​​ భారీ రికార్డ్​ వేలం

హార్లీ డేవిడ్​సన్ బైక్​​.. వేలంలో భారీ ధర పలికింది. 1908లో తయారు చేసిన ఈ బైక్​ రూ.7,71,56,200కు అమ్ముడుపోయింది. ఈ బైక్​ ప్రత్యేకలేంటో తెలుసా మరి..

Harley Davidson
హార్లీ డేవిడ్​సన్ బైక్​​ వేలం.. రికార్డ్​ ధరకు విక్రయం
author img

By

Published : Feb 12, 2023, 6:36 PM IST

హార్లీ డేవిడ్​సన్ బైక్​​ ఒకటి వేలంలో అత్యంత ఎక్కువ ధరకు అమ్ముడుపోయింది. 1908 సంవత్సరంలో తయారు చేసిన ఈ బైక్​.. రూ. 7,71,56,200 (9,35,000 అమెరికా డాలర్లు) ధర పలికి రికార్డు సృష్టించింది. స్ర్టాప్​ ట్యాంక్​ హార్లీ డేవిడ్​సన్​ అనే పేరు గల ఈ బైక్​ను.. జనవరిలో వేలానికి ఉంచారు. పాత కాలపు మోటార్​ బైక్​లు అమ్మే వింటజంట్​ వెబ్​సైట్​లో ఈ బైక్​కు వేలానికి పెట్టారు. ఈ వెబ్​సైట్​లోనే బైక్ భారీ ధరకు ​అమ్ముడైనట్లు అమెరికా వార్తా పత్రిక ది మిల్వాకీ జర్నల్ సెంటినెల్ శుక్రవారం వెల్లడించింది.

ఈ బైక్​కు స్ట్రాప్ ట్యాంక్ అని పేరు పెట్టడానికి గల కారణం.. బైక్​ ఆయిల్, ఇంధన​ ట్యాంక్​ను నికెల్​తో చేసిన పట్టీలతో జతచేయడమే. ప్రపంచంలోని అరుదైన 12 మోడళ్లలో ఇది ఒకటి. కాగా 1907 సంవత్సరంలో తయారు చేసిన స్ట్రాప్​ ట్యాంక్​ హార్లీ డేవిడ్​సన్​ బైక్ రూ. 5,90,01,800 (7,15,000) డాలర్లు పలికింది.

"మేము బైక్‌ వేలానికి బాగా ప్రచారం కల్పించాం. హార్లీ డేవిడ్​సన్..​ అమెరికన్ మోటార్‌ సైకిల్ బ్రాండ్​లో అత్యంత ప్రసిద్ధమైనది. కాబట్టి ఇది మంచి ధరకే అమ్ముడవుతుందని భావించాం. ఇది మా అంచనాలకు మించిన ధరకు అమ్ముడుపోయింది. రికార్డు ధరను సొంతం చేసుకున్నఈ బైక్​లో పూర్తి ఒరిజినల్​ భాగాలు ఉన్నాయి. చాలా అరుదైన వస్తువులతో ఈ బైక్​ను తయారు చేశారు."

--గ్రెగ్ ఆర్నాల్డ్, హార్లి డేవిడ్​సన్ కంపెనీ డివిజన్ మేనేజర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.