ETV Bharat / international

ప్యాసింజర్ రైలు- గూడ్స్​ ట్రైన్​ ఢీ.. 32 మంది మృతి.. 85 మందికి గాయాలు

author img

By

Published : Mar 1, 2023, 7:26 AM IST

Updated : Mar 1, 2023, 11:03 AM IST

ప్యాసింజర్​ రైలు, గూడ్స్​ ట్రైన్ పరస్పరం ఢీకొన్నాయి. ఈ ఘోర ప్రమాదంలో 32 మంది మృతి చెందగా.. 85 మంది గాయపడ్డారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

greece train accident
greece train accident

గ్రీస్​లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఓ ప్యాసింజర్​ ట్రైన్​ ఎదురుగా వస్తున్న మరో గూడ్స్​ రైలును ఢీకొట్టింది. దీంతో భారీగా మంటలు వ్యాపించాయి. ఈ ఘోర ప్రమాదంలో 32 మంది మృతి చెందగా.. 85 మంది గాయపడ్డారు.
బుధవారం తెల్లవారుజామున ఏథెన్స్​కు 380 కిలోమీటర్లు దూరంలో ఉన్న టెంపే ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. దీంతో ట్రైన్​లు పట్టాలు తప్పాయి. దాదాపు మూడు బోగీలు మంటలు చిక్కుకుని పూర్తిగా దగ్ధమయ్యాయి. చుట్టుపక్క ప్రాంతాల్లో దట్టమైన పొగలు వ్యాపించినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగే సమయంలో ప్యాసింజర్ ట్రైన్​లో దాదాపు 350 మంది ప్రయాణికులు ఉన్నారు.

greece train accident
ప్యాసింజర్​ రైలును ఢీకొట్టిన గూడ్స్​ ట్రైన్

సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. సహాయక చర్యలు ప్రారంభించారు. హుటాహుటిన క్షతగాత్రులను స్థానికి ఆస్పత్రులకు తరలిస్తున్నారు. కొందరు ప్రయాణికులకు స్వల్ప గాయాలు కాగా.. మిగిలిన వారు క్షేమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం వారిని ఓ బస్సులో మరో ప్రాంతానికి తరలిస్తున్నట్లు వెల్లడించారు. అయితే ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

greece train accident
ప్రమాదం కారణంగా మంటల్లో చిక్కుకున్న ట్రైన్​

'ఇది ఘోరమైన ప్రమాదం. ఇది ఓ భయంకరమైన రాత్రి. దృశ్యాలను వర్ణించడం చాలా కష్టం' అని సెంట్రల్​ థెస్సలీ గవర్నర్​ కోస్టాస్​ అగోరాస్టోస్​ అన్నారు. 'రెండు రైళ్లు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నందున చాలా క్లిష్ట పరిస్థితులు ఎదురయ్యాయి. ప్రస్తుతం గాయపడిన వారిని తరలించే ప్రక్రియ కొనసాగుతుంది. ఈ ప్రమాదంలో చాలా మందికి తీవ్ర గాయాలయ్యాయి. మంటల్లో చిక్కుకున్న బాధితులకు చికిత్స అందించడం కోసం.. డజన్ల కొద్దీ అంబులెన్స్​లు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. సహాయక సిబ్బంది తలకు హెడ్​ ల్యాంప్​లు ధరించి.. దట్టమైన పొగలో సైతం సహాయక చర్యలు చేపడుతున్నారు. శిథిలాలు కింద చిక్కుకున్న వారిని రక్షించడానికి.. రైళ్ల శిథిలాలను సిబ్బంది తొలగిస్తున్నారు' అని అగ్నిమాపక సేవా ప్రతినిధి వాసిలిస్​ వర్తకోయానిస్​ తెలిపారు. 'రైలు ముందుభాగం పూర్తిగా ధ్వంసమైంది. క్రేన్​లను తీసుకువస్తున్నాం. ప్రస్తుతం శిథిలాలను తొలగిస్తున్నాం' అని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతానికి సైన్యం సహాయం కోరినట్లు అధికారులు తెలిపారు.

greece train accident
ఘోర రైలు ప్రమాదం

"ప్రమాదం జరగడానికి ముందు, డ్రైవర్​ ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. దీంతో రైలు​ ఒక్కసారిగా ఆగిపోయి.. ఎదురుగా వచ్చిన ట్రైన్​ను ఢీకొట్టింది. మా బోగీ పట్టాలు తప్పలేదు, కానీ ముందు ఉన్నవి పూర్తిగా ధ్వంసమయ్యాయి. అవి మాకు స్పష్టంగా కనిపించాయి. నాలుగో బోగీలో ఉన్న నేను వెంటనే.. కిటికీని పగలగొట్టి బయటకు వచ్చాను" అని ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడిన ఓ యువకుడు తెలిపాడు.

Last Updated : Mar 1, 2023, 11:03 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.