south iran earthquake: దక్షిణ ఇరాన్లో శనివారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.3 తీవ్రతతో నమోదైంది. ఈ ఘటనలో అయిదుగురు మరణించగా, 44 మంది గాయపడ్డారు. దేశ రాజధాని టెహ్రాన్‌కు దక్షిణంగా 1,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న హోర్మోజ్గాన్ ప్రావిన్స్‌లో ఈ భూకంపం సంభవించింది. తెల్లవారుజామున ఈ ఘటన జరగడం వల్ల ప్రజలు వీధుల్లోకి వచ్చారు. భవనాలు, మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. గతేడాది ఇదే ప్రాంతంలో సంభవించిన భూకంపం వల్ల ఒకరు మృతి చెందారు.
ఇరాన్లో 1990లో సంభవించిన భారీ భూకంపం వల్ల 40,000 మంది ప్రాణాలు కోల్పోయారు. 2003లో 6.6 తీవ్రతతో బామ్ నగరంలో సంభవించిన భూకంపం వల్ల 26,000 మంది ప్రాణాలు కోల్పోయారు. 2017లో పశ్చిమ ఇరాన్లో 7 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల 600 మందికి పైగా మరణించగా, 9000 మంది గాయపడ్డారు.
చైనాలోని జిన్జియాంగ్ ప్రాంతంలో 4.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. శనివారం తెల్లవారిజామున 3.29 నిమిషాలకు ఈ భూకంపం వచ్చిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. ఇటీవల అఫ్గానిస్థాన్‌లో 6.1 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఇప్పటికే పేదరికంతో అల్లాడుతున్న ఆఫ్గాన్‌పై ఈ భూకంపం పెను తీవ్రతను చూపింది. అంతర్జాతీయ సాయం అందించాలని తాలిబన్ ప్రభుత్వం కోరింది. భూకంపం కారణంగా అఫ్గానిస్థాన్‌లో దాదాపు 1000 మంది మరణించగా, సుమారు 1500 మంది గాయపడ్డారు.
ఇవీ చదవండి: నేర విచారణకు మస్తిష్క తరంగాల విశ్లేషణ.. త్వరలోనే సరికొత్త సాంకేతికత!