ETV Bharat / international

మరో 7 లక్షల మరణాలు తప్పవు.. డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక - యూరప్​లో కరోనా మరణాలు పెరుగుతాయని హెచ్చరించిన డబ్ల్యూహెచ్​ఓ

రాబోయే రోజుల్లో కరోనా మరణాలు పెరుగుతాయని యూరప్​ పరిధిలోని ప్రపంచ ఆరోగ్య సంస్థ కార్యాలయం (who warns europe covid) హెచ్చరించింది. తమ పరిధిలోని 53 దేశాల్లో వచ్చే ఏడాది మార్చి నాటికి మరో ఏడు లక్షల మరణాలు నమోదవుతాయని పేర్కొంది. ఆస్పత్రుల్లో బెడ్లు, ఐసీయూల కొరతతో మధ్య ఆసియా, యూరప్ ఇబ్బందులు ఎదుర్కొంటాయని చెప్పింది.

who warns europe covid
కరోనా
author img

By

Published : Nov 23, 2021, 7:44 PM IST

వచ్చే ఏడాది మార్చి నాటికి మరో ఏడు లక్షల కరోనా మరణాలు సంభవిస్తాయని ఐరోపా​ పరిధిలోని ప్రపంచ ఆరోగ్య సంస్థ కార్యాలయం (who warns europe covid) హెచ్చరించింది. మొత్తంగా తమ కార్యాలయ పరిధిలోని 53 దేశాల్లో మరణాల సంఖ్య 20 లక్షలకు చేరుకుంటుందని వెల్లడించింది. కరోనా వ్యాక్సిన్ల ద్వారా వైరస్​ నుంచి రక్షణ క్షీణించడమే ఇందుకు నిదర్శనమని పేర్కొంది. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి క్రమంగా బూస్టర్ డోసు ఇవ్వాలని స్పష్టం చేసింది.

"యూరప్​, మధ్య ఆసియాలో వైరస్ వ్యాప్తి ఇంకా అధికంగానే ఉంది. శీతాకాలంలో వైరస్​ను ఎదుర్కొవాల్సి ఉంది. వైరస్​ కారణంగా 2022 మార్చి నాటికి మా పరిధిలోని 25 దేశాలు ఆస్పత్రుల్లో బెడ్లు లేక ఇబ్బందులు ఎదుర్కొంటాయి. 49 దేశాలకు ఐసీయూల కొరతతో ఒత్తిడి ఎదురవుతుంది."

-డా. క్లూజ్​, డబ్ల్యూహెచ్​ఓ యూరప్ డైరెక్టర్

మధ్య ఆసియాకు దగ్గరలో ఉన్న యూరప్ ప్రాంతంలో గతవారం వరకు ప్రతి రోజూ 4,200 మరణాలు సంభవించాయి. సెప్టెంబర్​ చివరిలో నమోదైన మరణాల కంటే ఇది రెండు రెట్లు ఎక్కువగా ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో మాస్క్​లు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి కరోనా నిబంధనలను తప్పకుండా ఆచరించాలని డబ్ల్యూహెచ్​ఓ యూరప్ కార్యాలయం (who europe on corona) తెలిపింది.

ఇదీ చదవండి: కొవాగ్జిన్ వేసుకున్నవారికి యూకే అనుమతి

'టీకా వేసుకోండి.. లేకపోతే కొవిడ్​ తెచ్చుకోండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.