ETV Bharat / international

రష్యాతో చర్చలకు ఉక్రెయిన్​ అంగీకారం- వేదిక అదే.. - ukraine news

Ukraine agrees to hold talks with Russia

author img

By

Published : Feb 27, 2022, 6:34 PM IST

Updated : Feb 27, 2022, 6:57 PM IST

18:31 February 27

రష్యాతో చర్చలకు ఉక్రెయిన్​ అంగీకారం- వేదిక అదే..

Ukraine agrees to hold talks with Russia: యుద్ధానికి ముగింపు పలికి శాంతి స్థాపన కోసం చర్చలకు రావాలంటూ రష్యా చేసిన ప్రతిపాదనకు ఉక్రెయిన్‌ అంగీకరించింది. చర్చలకు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వోలోదిమిర్‌ జెలెన్‌స్కీ అంగీకరించినట్లు రష్యా మీడియా వెల్లడించింది. బెలారస్‌ వేదికగా ఈ చర్చలు జరగనున్నాయి.

అంతకు ముందు జెలెన్‌స్కీ రష్యా చర్చల ప్రతిపాదనను తోసిపుచ్చారు. చర్చలకు తాము సిద్ధమే అయినా అవి బెలారస్‌లో వద్దని స్పష్టం చేశారు. బెలారస్‌లోని పలు ప్రాంతాల నుంచీ రష్యా దాడులు చేస్తోందన్న జెలెన్‌స్కీ తమపై దాడి చేయని దేశాల్లో మాత్రమే చర్చలు జరుపుతామని అన్నారు. అయితే అంతలోనే చర్చలకు జెలెన్‌స్కీ అంగీకరించటం గమనార్హం. పోలండ్‌ రాజధాని వార్సా, టర్కీలోని ఇస్తాంబుల్‌, అజర్‌బైజాన్‌ రాజధాని బకూ వంటి ప్రాంతాలు చర్చలకు అనువైనవిగా ఆయన పేర్కొన్నారు.

ఇదీ చూడండి: రష్యాపై మరిన్ని ఆంక్షలు.. ఐసీజే తలుపుతట్టిన ఉక్రెయిన్​

Last Updated : Feb 27, 2022, 6:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.