ఇంగ్లాండ్లో కరోనా డెల్టా వేరియంట్ ఏ.వై.4.2(AY.4.2) గుబులు రేపుతోంది. ఈ వేరియంట్ సోకుతున్నట్లు ఇంగ్లాండ్ ఆరోగ్య శాఖ గుర్తించింది. ఈ వైరస్ ప్రభావంతో జులై తర్వాత అత్యధికంగా.. సోమవారం ఒక్కరోజే 49,156 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.
మరోవైపు.. దేశంలో నమోదవుతున్నకేసులకు ఏ.వై.4.2(AY.4.2) కారణం కాదని ఓ అధికారి అభిప్రాయపడ్డారు. 'ఆల్ఫా, డెల్టాతో పోలిస్తే ఇది అంత ప్రమాదకరం కాదు. అవి 50-60 శాతం ఎక్కువ వేగంగా సంక్రమించగలవు. ఇది 10 శాతం వరకే వ్యాప్తి చెందే అవకాశం ఉంది' అని ఓ వైద్యాధికారి తెలిపారు.
ఇవీ చదవండి: