ETV Bharat / international

కరోనా కాలంలో ఎలా జల్సా చేస్తున్నారంటే? - ధనవంతులపై కరోనా ప్రభావం

కరోనా విజృంభణతో ప్రపంచ దేశాలు సంక్షోభంలో చిక్కుకున్నాయి. ఈ కారణంగా ఎంతో మంది సమస్యలు ఎదర్కొంటున్నారు. అయితే కొన్ని పాశ్చాత్య దేశాల్లో మాత్రం.. కరోనా నుంచి దూరంగా విలాసవంతంగా గడిపేందుకు ప్రణాళికలు వేసుకుంటున్నారు. ఇలాంటి వారితో ద్వీపాలు, బంకర్ల వంటి ఏకాంత ప్రదేశాలకు ఇటీవల డిమాండ్​ విపరీతంగా పెరిగింది.

luxury life in corona crisis
కోరనా కాలంలో లగ్జరీ జీవితాలు
author img

By

Published : May 6, 2020, 8:08 AM IST

కొవిడ్‌-19 తెచ్చిన ఈ విరామాన్ని విలాసంగా గడిపేస్తాం. అంతేనా... మా స్వర్గసుఖాలపై సామాజిక మాధ్యమాల్లో పోస్టులూ పెడతాం. ఇదీ పాశ్చాత్య దేశాల్లో కొందరు సంపన్నల తీరు. ప్రపంచవ్యాప్తంగా కుబేరులు కొందరు లాక్‌డౌన్‌ సమయంలో గ్రామీణ ప్రాంతాల్లోని తమ కలల గృహాలకు చేరారు. మరికొందరు ప్రైవేటు జెట్‌ బోట్లలో సముద్రయానాల్లో గడిపేస్తున్నారు. వైరస్‌ వ్యాప్తి ప్రమాదకరంగా ఉన్న దేశాలను వదిలి తాత్కాలికంగా దూరంగా ఏకాంత ప్రదేశాలకు వెళ్లేందుకు బుకింగ్స్‌ పెరిగాయని ప్రైవేట్‌ ఫ్లై విమానయాన కంపెనీ పేర్కొంది. ఇంకొందరు భూగర్భ నివాసాలు(బంకర్లు) కొనుగోలు చేసేందుకు అమితాసక్తితో ఉన్నారు. వీరి ఫోన్లతో టెక్సాస్‌కు చెందిన బంకర్స్‌ కంపెనీ టెలిఫోన్‌ నిరాటంకంగా మోగుతోంది. ఈ కంపెనీ బంకర్‌లో వ్యాయామశాల, ఆవిరి గది, ఈతకొలను, మసాజ్‌ స్నానపుతొట్టె(జాకుజీ), అందమైన తోట, గ్యారేజ్‌ వంటివన్నీ ఉన్నాయి. అందం, ఆరోగ్య సంరక్షణకు ఢోకా లేదు. ధర మనదేశ కరెన్సీలో రూ.62.75 కోట్లట మరి.

ఖర్చుపై కథనాలు..

క్వారంటైన్‌ సమయంలో సహాయకులను తోడు ఉంచుకోవాలా? లేక సొంతంగానే పనులు చేసుకోవాలా? అనేది పలువురు సంపన్నులు తేల్చుకోలేకపోతున్నారని అమెరికాలోని ప్రముఖ పత్రిక ఇటీవల ఓ కథనం ప్రచురించింది. లండన్‌లోని మరో పత్రికైతే... 'ఎలా ఖర్చు చేయాలి' అంటూ తన పాఠకులకు సలహాలను ఇచ్చింది. ఏ కంపెనీ వైన్‌ తాగాలో కూడా పరోక్షంగా సూచించింది.

home theater in under ground home
భూగర్భ గృహంలో హోం థియేటర్

ఇంట్లోనే ఉన్నా ప్యాషన్‌ ప్రమాణాలు తగ్గకుండా ఉండాల్సిన ప్రాముఖ్యతను మరో మేగజీన్‌ నొక్కి చెప్పింది. విలాసవంతమైన డ్రెస్సింగ్‌ గౌన్‌లను సైతం పాఠకులకు సిఫారసు చేసింది. మరికొందరు తమ వైన్‌ సెల్లార్లను పునరుద్ధరించే పనిలో పడడం వల్ల లండన్‌ వింబుల్డన్‌ ప్రాంతంలోని సంబంధిత కంపెనీకి రికార్డు స్థాయిలో ఆర్డర్లు వచ్చాయి. కరోనా వచ్చాకే స్కాటిష్‌ కోటలు, జనావాసాలు లేని కరేబియన్‌ దీవులు, బంకర్లు, కందకాలు ఉన్న ఇళ్ల కొనుగోళ్లు పెరిగాయని లండన్‌లోని ఓ ప్రముఖ స్థిరాస్తి కంపెనీ పేర్కొంది.

luxury bunker
విలాసవంతమైన బంకర్

మరింత ధనం సంపాదించే ఆలోచనలు...

లాక్‌డౌన్‌లో రోజులెలా గడవాలా? అని జనం అలోచిస్తుంటే.. కొందరు కుబేరులు మరింత ధనవంతులయ్యే మార్గాలను కనుగొన్నారని ఓ పరిశోధనా బృందం వెల్లడించింది. మార్చి 18- ఏప్రిల్‌ 10 మధ్య అమెరికా బిలియనీర్ల సంపద దాదాపు 10 శాతం పెరిగి 282 బిలియన్‌ డాలర్లకు చేరింది. స్టాక్‌ మార్కెట్‌ కూడా ఇందుకు ఊతమిచ్చింది. అలాగని అందరు సంపన్నులనూ ఒకే గాటిన కట్టలేం. కొందరు విపత్తు వేళ తమ మంచి మనసును చాటుకుంటున్నారు. మహమ్మారిపై పోరాటానికి ట్విట్టర్‌ వ్యవస్థాపకుడు జాక్‌ డోర్సే 100 కోట్ల డాలర్లు ఇస్తున్నారు. అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌ సైతం అమెరికాలోని ఆహార బ్యాంకులకు 100 మిలియన్‌ డాలర్లు ప్రకటించారు. బిల్‌గేట్స్‌ తన పౌండేషన్‌ ద్వారా కరోనాపై పోరుకు ఉదారంగా నిధులిస్తున్నారు.

ఇదీ చూడండి:భారతీయ విద్యార్థులకు సునీతా విలియమ్స్ పాఠాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.