ETV Bharat / international

భారతీయ విద్యార్థులకు సునీతా విలియమ్స్ పాఠాలు - సునీతా విలియమ్స్

భారతీయ అమెరికన్, నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్.. అమెరికాలోని భారతీయ విద్యార్థుల్లో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేశారు. వైరస్​తో ప్రపంచం ముప్పును ఎదుర్కొంటున్న వేళ.. విద్యార్థులు సమాజానికి ఏ విధంగా ఉపయోగపడతారో ఆలోచించాలన్నారు. ప్రయోజనాత్మకంగా వ్యవహరించాలని సూచించారు.

sunita williams
భారతీయ విద్యార్థులకు సునీతా విలియమ్స్ పాఠాలు
author img

By

Published : May 5, 2020, 3:02 PM IST

ప్రముఖ నాసా శాస్త్రవేత్త, భారతీయ అమెరికన్ సునీతా విలియమ్స్.. అమెరికాలో ఉన్న భారత విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. కరోనా​తో ప్రపంచం అతలాకుతలం అవుతున్న వేళ.. అమెరికాలో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థుల్లో స్ఫూర్తి నింపేందుకు ప్రయత్నించారు. సమాజానికి ఉపయోగపడే విధంగా ఆలోచించాలని ఉద్ఘాటించారు. ప్రస్తుతం భారతీయ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్య చాలా చిన్నదని చెప్పారు విలియమ్స్.

'అంతరిక్షంలో లేరు కదా'

అంతరిక్షంలో తాను 322 రోజులు గడిపిన విషయాన్ని గుర్తుచేసిన విలియమ్స్.. ఒంటరిగా ఉన్న సమయం ఆత్మపరిశీలన చేసుకునేందుకు మంచి అవకాశమని ఉద్ఘాటించారు. ప్రయోజనకరంగా, క్రియాశీలంగా, సానుకూలంగా ఆలోచించాలని సూచించారు. అంతరిక్ష నౌకలో ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవాలని పేర్కొన్న ఆమె.. మీ కుటుంబం, స్నేహితులతో కాలం గడపాలన్నారు. బాధ్యతగా వ్యవహరించాలని.. ఇతరులకు వైరస్ సోకేందుకు కారణం కాకూడదని హితబోధ చేశారు.

sunita williams
ఐఎస్​ఎస్​లో సునీతా విలియమ్స్

కిచెన్​ నుంచి..

హ్యూస్టన్​లోని తన ఇంటి కిచెన్​ నుంచి అమెరికాలోని భారతీయ విద్యార్థులతో వీడియో కాన్ఫరెన్స్​లో​ సంభాషించారు విలియమ్స్. అమెరికాలోని భారత రాయబార కార్యాలయం స్టూడెంట్ హబ్... ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. యూట్యూబ్​, ఫేస్​బుక్, ట్విట్టర్​ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా 84,000 మంది ఆమె ప్రసంగాన్ని వీక్షించారు.

సునీతపై ప్రశంసలు..

నిర్బంధంలో ఉండటంపై విలియమ్స్​ ఇచ్చిన సూచనల పట్ల ఆనందం వ్యక్తం చేశారు భారతీయ విద్యార్థులు. 'విద్యార్థులుగా ఉన్నప్పటి నుంచే సునీ(విలియమ్స్) మాకు స్ఫూర్తి. తనను చూసే ఏరో స్పేస్ ఇంజినీరింగ్ చదివేందుకు మొగ్గు చూపాను' అని చెప్పారు భారత స్టూడెంట్ హబ్ వలంటీర్ చెరీ సింగ్.

2006లో మొదటిసారిగా సునీతా విలియమ్స్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్​ఎస్​) వెళ్లారు. 2021లో మరోసారి రోదసీ యాత్రకు వెళ్లనున్నారు.

ఇదీ చూడండి: బలిపీఠమెక్కే తొలి జీవులు అవే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.