క్రొయేషియా మీదుగా ఐరోపా దేశాలకు చేరుకునేందుకు ప్రయత్నించిన వందలాది మంది వలసదారులు బోస్నియా సరిహద్దుల్లో హిమపాతంలో చిక్కుకుపోయారు. కొద్దిరోజులుగా పశ్చిమ బోస్నియాలో భారీగా మంచు కురుస్తుండగా అడుగుల మేర మంచు పేరుకుపోయింది.
సరిహద్దుల్లో శరణార్థుల కోసం ఏర్పాటు చేసిన శిబిరాలు ఇటీవల అగ్నిప్రమాదానికి దగ్ధమవగా ఏకధాటిగా కురుస్తున్న మంచు నుంచి తలదాచుకునేందుకు కూడా వారికి అవకాశం లేదు.
తమ పరిస్థితిని చూసి ఎవరైనా ఆదుకోవాలని, లేకుంటే ఆ గడ్డకట్టే మంచులో ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందని శరణార్థులు వేడుకుంటున్నారు. గడ్డకట్టే చలి నుంచి రక్షణ కోసం మంటలు వేసుకుంటూ కాస్త ఉపశమనం పొందుతున్నారు. త్వరగా తమకు ఐరోపా దేశాలకు వెళ్లేందుకు అనుమతివ్వాలని అధికారులను వేడుకుంటున్నారు.
ఇదీ చూడండి: భారత్లో ముందుగా కొవిషీల్డ్ టీకానే వస్తుందా?