కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా బాధితులను అనారోగ్య సమస్యలు నెలల పాటు వెంటాడుతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. కరోనా రోగుల్లో దీర్ఘకాలిక లక్షణాలను గుర్తించేందుకు.. లండన్‌కు చెందిన పలువురు వైద్య పరిశోధకులు ప్రపంచవ్యాప్తంగా ఓ వెబ్ ఆధారిత సర్వేను నిర్వహించారు.
203 లక్షణాలు..
ఈ అధ్యయనంలో పలు ఆసక్తికర విషయాలు బయటపడినట్లు తెలిపారు. మహమ్మారి నుంచి కోలుకున్నఅనంతరం కూడా.. బాధితులలో 10 అవయవాలపై సుమారు 203 లక్షణాలను గుర్తించినట్లు వివరించారు. వాటిలో కనీసం 66 లక్షణాలు.. బాధితులను సుమారు 7 నెలల పాటు వెంటాడినట్లు పేర్కొన్నారు. నెగెటివ్ వచ్చిన తర్వాత కూడా.. వైరస్ ఊపిరితిత్తులు, గుండె, కిడ్నీ, మెదడు అవయవాలపై అధిక ప్రభావం చూపుతున్నట్లు తెలిపారు.
అధిక శాతం మంది బాధితులు.. అలసట, మత్తుగా ఉండటం, సరిగా ఆలోచించలేకపోవడం, శ్వాస ఇబ్బందులు వంటి తదితర సమస్యలను ఎదుర్కొంటున్నట్లు వివరించారు.
ఇవీ చదవండి: