ETV Bharat / international

కరోనా వల్ల 2.8 కోట్ల మంది సర్జరీలు ఆగినట్లే! - corona latest updates

కొవిడ్​ మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా 2.8 కోట్ల మంది శస్త్రచికిత్సలు నిలిచిపోనున్నాయని ఓ అధ్యయనం తెలిపింది. ఆసుపత్రులకు అంతరాయం కలిగే కొద్ది.. ప్రతి అదనపు వారానికి మరో 24 లక్షల సర్జరీలు రద్దయ్యే అవకాశం ఉన్నట్లు పరిశోధకులు భావిస్తున్నారు.

COVID-19 pandemic will lead to over 28 million cancelled surgeries worldwide: Study
28 మిలియన్ల మంది సర్జరీలపై కరోనా ప్రభావం
author img

By

Published : May 15, 2020, 6:56 PM IST

కరోనా ప్రభావం శస్త్రచికిత్సలపై పడింది. ఈ మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా 2.8 కోట్ల సర్జరీలు నిలిచిపోయే అవకాశం ఉందని ఓ అధ్యయనం తెలిపింది. ఫలితంగా వైద్యం కోసం రోగులు సుదీర్ఘ సమయం ఎదురు చూడాల్సి పరిస్థితి ఏర్పడిందన్నారు.

శస్త్రచికిత్సలపై కరోనా ప్రభావాన్ని విశ్లేషించేందుకు.. 120 దేశాల భాగస్వమ్యంతో 'కొవిడ్​సర్జ్' అనే సహకార విభాగం ఏర్పాటైంది. 'బర్మింగ్​హమ్​ విశ్వవిద్యాలయానికి' చెందిన పరిశోధకులు ఈ అధ్యయనానికి నేతృత్వం వహించారు. 71 దేశాల్లోని 359 ఆసుపత్రుల నుంచి శస్త్రచికిత్సల రద్దుపై సమగ్ర సమాచారాన్ని సేకరించారు. మహమ్మారి పరిస్థితుల కారణంగా ఆసుపత్రి సేవలకు 12 వారాలు అంతరాయం ఏర్పడగా.. ఈ పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉన్నట్లు తెలిపారు.

వారంలో 24 లక్షలు రద్దు...

ఆసుపత్రులకు అంతరాయం కలుగుతున్న ప్రతి అదనపు వారానికి.. మరో 24 లక్షల సర్జరీలు రద్దయ్యే అవకాశం ఉందని 'బ్రిటన్​ జర్నల్​ ఆఫ్​ సర్జరీ'లో ప్రచురితమైన అధ్యయనం పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఖరారైన 72.3 శాతం శస్త్రచికిత్సలు రద్దవుతాయని పరిశోధకులు అంచనా వేశారు.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో రోగులకు వైరస్ సోకే ప్రమాదం ఉన్నందున ప్రస్తుతం సిద్ధంగా ఉన్న సర్జరీలు రద్దు చేయవచ్చు. ఈ వైరస్​ బారిన పడ్డ వారికి సాయమందించి.. మద్దతుగా నిలిచేందుకూ ఆసుపత్రులు ఉపయోగించనున్నారు.

బర్మింగ్​హమ్​​ విశ్వవిద్యాలయం

కీళ్ల​ వ్యాధుల చికిత్సల పైనా కరోనా ప్రభావం పడింది. 12 వారాల వ్యవధిలో ప్రపంచవ్యాప్తంగా 63 లక్షల​ ఆర్థోపెడిక్​ శస్త్రచికిత్సలు రద్దు చేసే అవకాశం ఉన్నట్లు పరిశోధకులు తెలిపారు. అంతేకాకుండా 23 లక్షల క్యాన్సర్​ చికిత్సలూ నిలిచిపోనున్నట్లు అంచనా వేశారు.

ఆలస్యమైతే మరణాలు తప్పవు..

ప్రస్తుతం సర్జరీలు ఆపే నిర్ణయం తప్పనిసరి అయినప్పటికీ.. రోగులపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని పరిశోధకులు భావిస్తున్నారు. తిరిగి శస్త్రచికిత్సకు ఏర్పాటు చేసినా.. తర్వాతి షెడ్యూల్​ సమయానికి వారి ఆరోగ్య పరిస్థితి క్షీణించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. క్యాన్సర్​ తదితర సర్జరీలు ఆలస్యమయ్యే కొద్దీ మరణాలకు దారి తీసే ప్రమాదం ఉన్నందున.. ఆసుపత్రులు క్రమం తప్పకుండా పరిస్థితిని అంచనా వేస్తుండాలని ప్రభుత్వాలకు సూచించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.