ETV Bharat / international

10 లక్షల జీవజాతులకు ముప్పు.. మనకూ తప్పదా? - ఐరాస

మానవ చర్యల కారణంగా సుమారు 10 లక్షల జీవజాతులు అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయని ఐక్యరాజ్యసమితి ముసాయిదా నివేదిక వెల్లడించింది. తన మనుగడకు ప్రాణాధారమైన ప్రకృతి వనరుల పట్ల మనిషి వహిస్తున్న నిర్లక్ష్య ధోరణిని ఎత్తిచూపింది. ఇలానే కొనసాగితే మన జీవ మనుగడకు ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించింది.

10 లక్షల జీవజాతులకు ముప్పు.. మనకూ తప్పదా?
author img

By

Published : May 6, 2019, 5:40 PM IST

భూమి.. మానవునికే కాదు... సమస్త జీవజాతులకు నివాసం. అలాంటి భూమిని మనం ఇష్టానుసారం వాడుకుంటున్నాం. విచ్చలవిడి వనరుల వాడకం, అడవుల నరికివేత, జంతుజాతులపై దాడి వంటి దుశ్చర్యలతో మానవజాతి ప్రకృతి సమతుల్యాన్ని దెబ్బతీస్తున్న పరిస్థితి నెలకొంది.

ప్రకృతి సమతుల్యం దెబ్బతింటున్న తీరుపై 450 మంది నిపుణులు 1800 పేజీల నివేదిక తయారు చేశారు. ఇందుకోసం 15వేల ప్రదేశాల నుంచి సమాచారం సేకరించారు. ఇంతటి భారీ నివేదిక సారాంశాన్ని దేశాధినేతలకు అందిస్తున్నారు.

కేవలం పర్యావరణానికే కాకుండా.. ఆర్థికాభివృద్ధికి ఈ నివేదిక దోహద పడుతుందని కమిటీ సభ్యులు వ్యాఖ్యానించారు.

వేగంగా ముప్పు...

గత 10 మిలియన్​ సంవత్సరాలుగా జీవజాతుల హనన వేగం 10 నుంచి 100 శాతం పెరిగిందని ఐరాస నిపుణుల బృందం లెక్కగట్టింది. 66 మిలియన్​ ఏళ్ల క్రితం అంతరించిపోయిన డైనోసర్ల తర్వాత ఆ స్థాయిలో జీవజాతుల వినాశనం జరిగే అవకాశం ఉందని హెచ్చరించింది.

"ప్రస్తుతం మానవులకు అంత ప్రమాదం లేదు. కానీ అనతి కాలంలో ఏం జరుగుతుందో చెప్పలేం. మానువులు ఇలానే ప్రవర్తిస్తే... ప్రకృతి తన దారి తాను చూసుకుంటుంది. ఈ పరిస్థితి మారాలంటే పూర్తి స్థాయి మార్పులు అవసరం. ఉత్పత్తి, వినియోగంలో ఈ మార్పులు జరగాలి. ముఖ్యంగా ఆహార ఉత్పత్తులపై ఈ మార్పు తప్పనిసరి."
- నివేదిక సారాంశం

గత అక్టోబర్​లో ఐరాస ఇచ్చిన నివేదికలో భూతాపం గురించి ఆందోళన వ్యక్తం చేశారు. విపరీతంగా పెరిగిపోతోన్న ఉష్టోగ్రతలను తగ్గించాలంటే సామాజిక మార్పు అవసరమని సూచించారు.
మొట్టమొదటిసారి ఐరాస అంతరించిపోతున్న జీవ జాతులకు గల కారణాలను తెలిపింది.

⦁ దేశాలు ఆహారపంటల దిగుబడి కోసం విచ్చలవిడిగా ఎరువులు, పురుగు మందులు వాడటం వల్ల వాటి ప్రభావానికిలోనై కీటక జాతులు వేగంగా అంతరించిపోతున్నాయి.

సీతాకోక చిలుకలు ఏమవుతాయో?
సీతాకోక చిలుకలు ఏమవుతాయో?

⦁ కీటక జాతులు అంతరించిపోవడం వల్ల జీవగడియారం దెబ్బతిని వాటిపై ఆధారపడే జంతుజాలం సంఖ్య ఏటా తగ్గిపోతోంది.

⦁ సముద్రంలోని చేపల సంఖ్య 7% తగ్గిపోవడం. మనుగడ కోసం ప్రయత్నించే స్థాయికి పడిపోవడం.

సముద్ర జలాల సంగతేంటి?
సముద్ర జలాల సంగతేంటి?

⦁ భూతాపం కూడా ఇందుకు ఓ కారణమే.

కోతి జాతులకు ముప్పు!
కోతి జాతులకు ముప్పు!

⦁ అంతకంతకూ పెరిగిపోతోన్న కాలుష్యం, విషవాయువులు. కర్మాగారాల్లోని వృథా నీరు నదులు, సముద్రాల్లోకి పంపడం.

⦁ జనాభా పెరుగుదల, ఆహార వినియోగం.

జీవ వైవిధ్యంపై 2020 అక్టోబర్​లో జరగనున్న ఐక్యరాజ్య సమితి సమావేశానికి ఈ నివేదిక మార్గదర్శకంగా నిలవనుందని కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు.

జిరాఫీల సంగతి ఏంటి?

New Delhi, May 06 (ANI): The makers of Netflix crime thriller, 'Sacred Games' released the teaser of the second season on Monday. The official Instagram account of Netflix India shared the 26-second teaser and wrote, "Season 2 is coming. Put your chattris in the air. #SacredGamesS2." The teaser did not reveal much, but the excited fans and viewers will be surprised to see the new addition of actors into the game. Based on Vikram Chandra's 2006 novel by the same name, 'Sacred Games' received immense critical acclaim for the gripping plot and powerful performances. All the eight hour-long episodes were directed by Anurag Kashyap and Vikramaditya Motwane.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.