ఇంగ్లాండ్ రీడింగ్ నగరంలోని ఫోర్బురీ పార్కులో దారణం జరిగింది. దుండగుల కత్తిపోట్లకు ముగ్గురు అక్కడిక్కడే మృతిచెందగా... అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. దీంతో పోలీసులతో పాటు, తీవ్రవాద నిరోధక బృందం రంగంలోకి దిగి విచారణ చేపట్టింది.
ఘటనా స్థలంలో ఓ యుకుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. అతడు లిబియాకు చెందినవాడిగా అనుమానిస్తున్నారు.
అయితే, ఈ దాడికి పాల్పడినవారు అమెరికాలో జార్జ్ ఘటనకు వ్యతిరేకంగా సాగుతున్న 'బ్లాక్ లైవ్స్ మ్యాటర్స్' నిరసనతో ముడిపడి ఉన్నట్లు సూచనలు లేవని స్పష్టం చేశారు అధికారులు.
ఈ భయంకరమైన ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు ప్రధాని బోరిస్ జాన్సన్. పోలీసులు, అత్యవసర విభాగాధికారులు స్పందించిన తీరును ప్రశంసించారు బ్రిటన్ హోం మంత్రి ప్రీతీ పటేల్.
ఇదీ చదవండి:మహిళల వివాహ వయసు పెంపునకు మరో అడుగు