ETV Bharat / international

కరోనా వైరస్​ మన దుస్తులకు అంటుకుంటుందా? - karona news in telugu

కరోనా కారణంగా అడుగు బయట పెట్టాలంటే భయం. వైరస్​ ఎటు నుంచి వస్తోందనని అడుగడుగునా అనుమానమే. ఇంటికి వైరస్‌ను మోసుకెళుతున్నామా? మన దుస్తులకు, చెప్పులకు అది అంటుకుంటుందా? వెంట్రుకలకు, తలపై అంటుంకుంటే ఎంతసేపు బతికి ఉంటుంది? వంటి మీ సందేహాలన్నింటికీ సమాధానమే ఈ కథనం.

spread of corona virus on clothes, hair and shoes
వైరస్​ మన దుస్తులకు ఎందుకు అంటుకోదు?
author img

By

Published : May 19, 2020, 7:22 AM IST

లాక్‌డౌన్‌లు తెరుచుకుంటూ.. జనం నెమ్మదిగా సాధారణ జీవితంలోకి అడుగుపెడుతున్న వేళ వారికి సరికొత్త అనుమానాలు, ఆందోళనలు చుట్టుముడుతున్నాయి. 'నేను ఇంటికి వైరస్‌ను మోసుకెళున్నామే..! నేను వేసుకుంటున్న దుస్తులు సురక్షితమైనవేనా? వాటికి వైరస్‌ అంటుకుంటుందా? బయటి నుంచి వచ్చిన ప్రతిసారీ స్నానం చేయాలా? బూట్లు, చెప్పుల పరిస్థితి ఏమిటి?' వంటి ప్రశ్నలతో సతమతం అవుతున్నారు. న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక అక్కడి శాస్త్రవేత్తలతో మాట్లాడి... ఈ సందేహాలను నివృత్తి చేసే ప్రయత్నం చేసింది.

నిత్యావసరాలు, ఔషధాలు తదితరాల కోసం బయటికి వెళ్లి వచ్చిన తర్వాత ఒంటిపై దుస్తులు విప్పేయాలా? తలస్నానం చేయాలా?

"కొవిడ్‌ బాధితులు, వైరస్‌ గుప్తవాహకులు తుమ్మినా, దగ్గినా... వారి నుంచి వచ్చే తుంపర్లు, శ్వాస రేణువులు గాలిలో అరగంట వరకు ఉంటాయని వివిధ అధ్యయనాలు చెబుతున్నాయి. అవి అటు నుంచి ఇటు గాలిలో ప్రయాణించలేవు. నెమ్మదిగా నేలపైనే పడిపోతాయి" అని వర్జీనియా టెక్నాలజీస్‌ (అమెరికా)లో శ్వాస రేణువులపై పరిశోధిస్తున్న శాస్త్రవేత్త లిన్‌సే మార్‌ తెలిపారు. అంటే రేణువులు మన దుస్తులను అంటుకునే శాతం చాలా తక్కువగా ఉంటుందన్నారు. మనలోని చాలామంది భౌతిక దూరం పాటిస్తున్నారు కాబట్టి బయటికి వెళ్లి వచ్చిన ప్రతిసారీ దుస్తులు మార్చుకోవడం, స్నానం చేయడం అవసరం లేదన్నారు. చేతులను మాత్రం సబ్బు నీళ్లతో తప్పనిసరిగా శుభ్రం చేసుకోవాలని స్పష్టం చేశారు. ఒకవేళ మీకు సమీపంలోఎవరైనా తుమ్మినా, దగ్గినా దుస్తులు మార్చుకుని, స్నానం చేస్తేనే మేలు.

సూక్ష్మ తుంపర్లు, శ్వాస రేణువులు మన దుస్తులను ఎందుకు అంటుకోవు?

"ఎరోడైనమిక్స్‌ ప్రకారం... మనిషి శరీరం చుట్టూ గాలి ప్రవాహం ఉంటుంది. దాని ఒత్తిడి కారణంగానే మనం నెమ్మదిగా కదులుతాం. అడుగేస్తున్న ప్రతిసారీ ఈ గాలిని ముందుకు నెడతాం. అప్పుడు గాలిలోని సూక్ష్మ తుంపర్లు, రేణువులు సైతం ముందుకు వెళతాయి. అందుకే అవి మన దుస్తులపై పడవు. ఎవరైనా మనకు రెండు మీటర్ల కంటే అతి దగ్గరగా ఉండి దగ్గి, తుమ్మితేనే తుంపర్లు అంటుకుంటాయి" అని శాస్త్రవేత్త లిన్‌సే మార్‌ వివరించారు.

తల వెంట్రుకలు, గడ్డంలో వైరస్‌ నిలిచి ఉండే ప్రమాదముందా?

"ప్రతి ఒక్కరూ భౌతిక దూరంతోపాటు, మాస్కును ధరించినంత కాలం వెంట్రుకలతో వైరస్‌ సోకే సమస్య ఉండదు. ఒకవేళ మన వెనుక ఎవరైనా తుమ్మినా, దగ్గినా పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు" అని వాషింగ్టన్‌ యూనివర్సిటీలోని స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌కు చెందిన పరిశోధకుడు డాక్టర్‌ ఆండ్రూ జనోవిస్కీ తెలిపారు. వైరస్‌ వాహకులు సైతం మాస్కు ధరిస్తే వ్యాధి ఇతరులకు సోకే అవకాశం చాలా తక్కువ శాతం ఉంటుందన్నారు.

దుస్తులు ఉతికేప్పుడు వైరస్‌ బారిన పడే ప్రమాదముందా?

"మనం ఎవరి దుస్తులు ఉతుకుతున్నామనే దానిపై ఇది ఆధారపడి ఉంటుంది. కరోనా వైరస్‌లు సబ్బులకు లొంగుతాయి. సాధారణ దుస్తులను సర్ఫ్‌, సబ్బులతో ఉతికేప్పుడు ఎలాంటి సమస్యా ఉండదు. ఉతికిన తర్వాత బాగా ఎండనిస్తే సరిపోతుంది. ఒకవేళ జబ్బు పడిన వారిని కలిసినా, వారికి సపర్యలు చేసినా, వారి దుస్తులను ఉతుకుతున్నా... జాగ్రత్తలు తీసుకోవాలి. మిషిన్‌లో ఉతికితే నీటిని సాధ్యమైనంత ఎక్కువ వేడి చేసేలా దాన్ని సెట్‌ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ దుస్తులను విదిలించరాదు. వాటిని పూర్తిగా ఆరనివ్వాలి" అని శాస్త్రవేత్త లిన్‌సేమార్‌ సూచించారు.

దుస్తులు, ఇతర ఉపరితలాలపై వైరస్‌ ఎంతకాలం బతికి ఉంటుంది?

"ది న్యూ ఇంగ్లాండ్‌ జర్నల్‌లో మార్చిలో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం... కరోనా వైరస్‌ సాధారణ పరిస్థితుల్లో లోహాలు, ప్లాస్టిక్‌పై మూడు రోజులు, కార్డ్‌బోర్డ్‌పై 24 గంటలపాటు బతికి ఉంటుంది. ఈ అధ్యయనం దుస్తుల గురించి పరిశోధించలేదు. అయితే కార్డ్‌బోర్డ్‌లో ఉండే పోగులు... సాధారణ ఉపరితలాలపై కంటే ముందుగానే వైరస్‌ ఎండిపోయేలా చేశాయి" అని నిపుణులు భావిస్తున్నారు. కరోనా కుటుంబానికే చెందిన సార్స్‌ ప్రబలినప్పుడు 2005లో కాటన్‌ గౌన్‌పై ఒక అధ్యయనం చేశారు. అత్యధిక స్థాయిలో వైరస్‌ను వేసినప్పుడు కూడా దాని ప్రభావం 5 నిమిషాల నుంచి 24 గంటల్లోనే తొలిగిపోయినట్లు గుర్తించారు’ అని డాక్టర్‌ ఆండ్రూ జనోవిస్కీ తెలిపారు.

బయటికి వెళ్లి వచ్చిన ప్రతిసారీ బూట్లు, చెప్పులను శానిటైజర్‌తో డిస్‌ఇన్‌ఫెక్ట్‌ చేయాలా?

"బూట్లు, చెప్పులకు వైరస్‌, బ్యాక్టీరియాలు అధికంగానే అంటుకుంటాయి. అయితే అవి ఇన్‌ఫెక్షన్లకు అతి తక్కువ కారణం అవుతాయి. అమెరికాలోని రాక్‌ఫోల్డ్‌ షూ కంపెనీ వారు 2008లో చేసిన, ఇటీవల చైనాలో చేసిన అధ్యయనాల ప్రకారం... బూట్లకు గడ్డి పరకలు, దుమ్ము, ధూళి, బ్యాక్టీరియా, వైరస్‌లు అంటుకున్నట్లు తేలింది. అందుకే వాటిని ఇంటి బయటే వదిలేయాలి. అవకాశముంటే శుభ్రంగా కడిగేయాలి. ఇంట్లో బూట్లు, చెప్పులు ధరించడం మానేయాలి. శౌచాలయానికి వెళ్లిన ప్రతిసారీ చేతులతోపాటు పాదాలను సైతం శుభ్రం చేసుకోవాలి" అని డాక్టర్‌ ఆండ్రూ జనోవిస్కీ వివరించారు.

వ్యాయామానికి, వ్యాహ్యాళికి, కుక్కలను బయట తిప్పడానికి వెళితే వైరస్‌ సోకే ముప్పు పెరుగుతుందా?

"ఇతరులకు దూరంగా ఉండటంతోపాటు చేతులను శుభ్రం చేసుకున్నంత వరకు ఆరుబయట వ్యాయామాలతో ఎలాంటి ముప్పూ ఉండదు. అదే సమయంలో వైరస్‌ వ్యాప్తి చెందకుండా బయట ప్రాంతాలను అధికారులు డిస్‌ఇన్‌ఫెక్ట్‌ చేయాల్సిందే" అని ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో ఉన్న వాతావరణ నాణ్యత, ఆరోగ్యంపై అంతర్జాతీయ ప్రయోగశాల డైరెక్టర్‌ లిడియా మొరవస్క వివరించారు. ఆరుబయట వైరస్‌ తుంపర్లు గాలి ప్రవాహం కారణంగా వెంటనే డైల్యూట్‌ అవుతాయి. ప్రజలు కిక్కిరిసి ఉండే ప్రాంతాలకు వెళ్లనంత వరకు ఆరుబయలు సురక్షితమేనన్నారు.

ఇదీ చదవండి:52 కిలోల భారీ పనస పండుకు గిన్నిస్​ రికార్డు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.