ETV Bharat / international

మోదీ ఇటలీ ప్రయాణం.. వయా పాకిస్థాన్ గగనతలం! - జీ20 సమావేశంలో మోదీ

ఇటలీ పర్యటన కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Modi Italy Tour) ప్రయాణించిన విమానం.. పాకిస్థాన్​ గగనతలం(Pakistan Airspace Open For India) పైనుంచి వెళ్లింది. గగనతలాన్ని ఉపయోగించుకునే విషయంపై భారత్ చేసిన అభ్యర్థనకు సానుకూలంగా స్పందించింది పాకిస్థాన్​. ఈ మేరకు ఓ అంతర్జాతీయ మీడియా తన కథనంలో తెలిపింది.

Modi Italy Tour
మోదీ ఇటలీ పర్యటన
author img

By

Published : Oct 31, 2021, 4:45 PM IST

జీ20 సదస్సు(G20 Summit 2021) కోసం ఇటలీ పర్యటనకు(Modi Italy Tour) వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమానం... పాకిస్థాన్​ గగనతలం మీదుగా ప్రయాణించింది. ఈ పర్యటన పూర్తి చేసుకుని తిరిగి భారత్​ చేరుకునే క్రమంలో కూడా పాక్​​ గగనతలంపై(Pakistan Airspace Open For India) నుంచే మోదీ విమానం రానుంది. ఈ మేరకు ఓ అంతర్జాతీయ మీడియా తన కథనంలో తెలిపింది.

మోదీ విమానం బోయింగ్ 777, 300ఈఆర్​, కే7066.. బహవలపుర్​ నుంచి పాకిస్థాన్​ గగనతలంలోకి ప్రవేశించింది. టుర్బాత్​, పంజ్​గుర్​ను దాటి వయా ఇరాన్, టర్కీ మీదుగా ఇటలీకి చేరుకుంది. ఇటలీ పర్యటన కోసం మోదీ విమానానికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని పాక్​ విదేశాంగ శాఖను భారత్​ కోరిందని సివిల్ ఏవియేషన్ అథారిటీ వర్గాలు తెలిపాయి. దీనిపై పాక్ సానుకూలంగా స్పందించి, అనుమతించిందని(Pakistan Airspace Open For India) చెప్పాయి. ఈ మేరకు 'ది ఎక్స్​ప్రెస్​ ట్రిబ్యూన్' తన కథనంలో పేర్కొంది.

2019లో జమ్ముకశ్మీర్​ ప్రత్యేక హోదాను కేంద్రం రద్దు చేసిన నేపథ్యంలో... పాక్​పై భారత్​ గుర్రుగా ఉంది. ఈ నేపథ్యంలో మోదీ విమానం వెళ్లేందుకు పాక్ అనుమతించడం.. ప్రాధాన్యం సంతరించుకుంది. గత నెలలోనూ.. క్వాడ్ సదస్సులో భాగంగా మోదీ అమెరికా పర్యటన కోసం.. తమ గగనతలం మీదుగా వెళ్లేందుకు పాక్ అనుమతించింది. అయితే.. అంతకుముందు 2019లో మోదీ సౌదీ అరేబియా పర్యటన కోసం పాక్ గగనతలాన్ని వినియోగించుకోవాలని భారత్​ చేసిన విజ్ఞప్తిని పాక్ నిరాకరించటం గమనార్హం.

జీ20 సదస్సు(G20 Summit 2021) కోసం శుక్రవారం ఇటలీకి చేరుకున్నారు మోదీ. అక్కడ ప్రపంచ దేశాధినేతలతో కలిసి పలు కీలక అంశాలపై చర్చల్లో పాల్గొన్నారు. గ్లాస్గోలో జరిగే కాప్​26 ప్రపంచ నేతల సదస్సులో మోదీ పాల్గొంటారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.