ETV Bharat / international

'ఒమిక్రాన్​ వ్యాప్తి 70రెట్లు ఎక్కువ.. కానీ ఆ విషయంలో మాత్రం వీక్!' - ఒమిక్రాన్​ వ్యాప్తి

Omicron variant news latest: డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్​ వేరియంట్​.. పూర్తి భిన్నమైనదని తాజా అధ్యయనంలో తేలింది. శరీరంలోకి గాలి ప్రవేశించే మార్గాల ద్వారా ఒమిక్రాన్‌ వేరియంట్.. డెల్టా కంటే 70 రెట్లు వేగంగా చొచ్చుకెళుతున్నట్లు పరిశోధనల్లో వెల్లడైంది. అయితే.. శరీరంలోకి ప్రవేశించిన తర్వాత ఊపిరితిత్తుల కణజాలాల్లోకి చేరడంలో మాత్రం ఒమిక్రాన్‌.. కరోనా అసలు వేరియంట్‌తో పోలిస్తే 10 రెట్లు నెమ్మదిగా పయనిస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు.

Omicron variant news latest
గుడ్​ న్యూస్​- ఒమిక్రాన్​ వ్యాప్తి ఎక్కువే.. కానీ!
author img

By

Published : Dec 16, 2021, 1:26 PM IST

Omicron variant news latest: ప్రపంచవ్యాప్తంగా కరోనా డెల్టా వేరియంట్ సృష్టించిన విలయం అంతాఇంతా కాదు. అమెరికా, బ్రెజిల్‌ వంటి దేశాల్లో నిత్యం వేలాది మంది మృత్యువాత పడగా... భారత్‌లోనూ రెండో దశ ఉద్ధృతిలో.. డెల్టా మారణహోమం సృష్టించింది. ఊపిరితిత్తులపై దాడిచేసి బాధితుల్ని దెబ్బతీయడం సహా ప్రాణాలు కోల్పోయే పరిస్థితికి తీసుకెళ్లింది. అయితే ప్రస్తుతం ప్రపంచాన్ని కలవరపెడుతున్న ఒమిక్రాన్‌ వేరియంట్ మాత్రం.. డెల్టాతో పోలిస్తే పూర్తి భిన్నమైనదని తాజా అధ్యయనం ద్వారా వెల్లడైంది.

శరీరంలోకి గాలి ప్రవేశించే మార్గాల ద్వారా ఒమిక్రాన్‌ వేరియంట్.. డెల్టా కంటే 70 రెట్లు వేగంగా చొచ్చుకెళుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. అందువల్ల ఈ వేరియంట్ చాలా వేగంగా ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి వ్యాపిస్తోందని పేర్కొన్నారు. కానీ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత ఊపిరితిత్తుల కణజాలాల్లోకి చేరడంలో మాత్రం ఒమిక్రాన్‌.. కరోనా అసలు వేరియంట్‌తో పోలిస్తే 10 రెట్లు నెమ్మదిగా పయనిస్తున్నట్లు గుర్తించారు. ఫలితంగానే ఒమిక్రాన్‌ సోకినప్పటికీ... బాధితులు తీవ్రంగా ప్రభావితం కావడం లేదని పరిశోధకులు పేర్కొన్నారు.

ఒమిక్రాన్‌పై అధ్యయనంలో గుర్తించిన అంశాలను.. ఇంకా ప్రచురించలేదు. అందువల్ల ఆ వివరాలను పరిశోధకులు బయటకు విడుదల చేయలేదు. కానీ హాంకాంగ్‌ యూనివర్సిటీ ఒక వార్తను విడుదల చేసింది. వైరస్‌ పరివర్తన కారణంగా.. మనుషుల్లో ఈ వేరియంట్ తీవ్ర ప్రభావం చూపడం లేదనే విషయాన్ని గమనించినట్లు అధ్యయన బృందం సారథి డాక్టర్‌ మిచెల్‌ చాన్‌ చీ-వాయ్ చెప్పారు. ఇందులో ఆయా వ్యక్తుల రోగనిరోధక శక్తి ప్రతిస్పందన కూడా కీలకపాత్ర పోషించవచ్చని పేర్కొన్నారు. రోగనిరోధక శక్తి బాగా తక్కువగా ఉండేవారి ప్రాణాలకు మాత్రం.. ముప్పు ఉండొచ్చని అంచనా వేశారు. ఎక్కువ మందికి వ్యాపించడం ద్వారా వైరస్‌ క్రమంగా ప్రమాదకరంగా మారవచ్చని తెలిపారు. ఈ క్రమంలో ఒమిక్రాన్‌ వేరియంట్.. వ్యాక్సిన్ల ద్వారా వచ్చే వ్యాధి నిరోధక శక్తిని పాక్షికంగా తప్పించుకునే అవకాశం ఉందని అంచనా వేశారు. అందుకే కొత్త వేరియంట్ ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని మొదట సూచించినట్లు వివరించారు.

Omicron protein spike: ఒమిక్రాన్‌ వేరియంట్‌కు ఎక్కువ కొమ్ములు ఉండడం వల్ల.. అది కణాలను చాలా గట్టిగా పట్టుకొని ఉంటుందని.. అమెరికా న్యూజెర్సీలోని జోసెఫ్‌ లుబిన్‌ రూగర్స్‌ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. కణజాలాల్లోకి ఇన్ఫెక్షన్‌కు పంపేందుకు.. ఒమిక్రాన్‌ మ్యుటేషన్స్‌ సహకరిస్తాయని వారు వెల్లడించారు. ఈ క్రమంలో.. యాంటీబాడీలు వైరస్‌పై పోరాటంలో తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. కొన్ని యాంటీబాడీలు సమర్థంగా ఉన్నప్పటికీ, మరికొన్ని బలహీనపడే అవకాశం ఉందని పరిశోధకులు తెలిపారు. బూస్టర్‌ డోసులు యాంటీబాడీలను మరింత క్రీయాశీలకం చేస్తాయని.. పరిశోధకులు వివరించారు. అందువల్ల బూస్టర్‌ డోస్‌ తీసుకుంటే..ఈ వేరియంట్‌పై సమర్థంగా పోరాడవచ్చని తెలిపారు.

మరోవైపు వైరస్‌ సోకినప్పటికీ ఎలాంటి లక్షణాలు లేని వారు ప్రపంచవ్యాప్తంగా 40.5శాతం కేసులు పెరగడానికి కారణమవుతున్నట్లు.. మరో అధ్యయనం ద్వారా వెల్లడైంది. ఈ అధ్యయనంలో 19వేల 884 మంది పాల్గొనగా.. వారిలో 40 శాతం మందిలో ఎలాంటి లక్షణాలు లేవని గుర్తించారు. ఇలాంటి వారి ద్వారానే వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి:- Omicron symptoms: ''ఒమిక్రాన్‌' బాధితుల్లో రాత్రిళ్లు విపరీతమైన చెమట'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.