ETV Bharat / international

భారత్​లో 'ఒమిక్రాన్​' కేసులపై డబ్ల్యూహెచ్​ఓ హెచ్చరిక! - పూనమ్​ ఖేత్రపాల్​ సింగ్​

Omicron variant in India: భారత్​లో రెండు ఒమిక్రాన్​ కేసులు గుర్తించడంపై డబ్ల్యూహెచ్​ఓ స్పందించింది. ఒమిక్రాన్​లో చాలా మ్యుటేషన్లు ఉన్నాయని, అందులో కొన్ని ఆందోళనకరంగా ఉన్నట్లు హెచ్చరించింది.

Dr Poonam Khetrapal Singh
డాక్టర్​ పూనమ్​ ఖేత్రపాల్​ సింగ్
author img

By

Published : Dec 2, 2021, 6:20 PM IST

Omicron variant in India: భారత్​లో రెండు ఒమిక్రాన్​ కేసులు వెలుగు చూసిన క్రమంలో కీలక వ్యాఖ్యలు చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. డబ్ల్యూహెచ్​ఓ ఆగ్నేయాసియా​ ప్రాంతంలో గుర్తించిన తొలి రెండు కేసులు ఇవేనని స్పష్టం చేసింది. ఒమిక్రాన్​లో చాలా మ్యుటెషన్లు ఉన్నాయని, అందులో కొన్ని ఆందోళనకరంగా ఉన్నట్లు హెచ్చరించింది.

"భారత్​లో ఒమిక్రాన్ వేరియంట్​​ కేసులు వెలుగుచూశాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగ్నేయాసియా ప్రాంతంలో తొలి రెండు కేసులు ఇవే. దేశాలు అనుసంధానమైన ప్రస్తుత పరిస్థితుల్లో కేసులు రావటం పెద్ద విషయం కాదు. ఒమిక్రాన్​ వేరియంట్​లో పెద్ద సంఖ్యలో మ్యుటేషన్లు ఉన్నాయి. అందులో కొన్ని ఆందోళనకరంగా కనిపిస్తున్నాయి. ఒమిక్రాన్​ సంక్రమణ, రోగనిరోధక శక్తిని ఎదుర్కొనే సామర్థ్యం వంటి ఇతర అంశాలపై ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఒమిక్రాన్​ వేరియంట్లను త్వరగా గుర్తించి ప్రపంచానికి తెలియజేసే దేశాలను డబ్ల్యూహెచ్​ఓ ప్రశంసిస్తుంది."

- డాక్టర్​ పూనమ్​ ఖేత్రపాల్​ సింగ్​, డబ్ల్యూహెచ్​ఓ రీజినల్​ డైరెక్టర్​

బెంగళూరులో గుర్తింపు..

కర్ణాటక బెంగళూరులోనే రెండు ఒమిక్రాన్​ కేసులు వెలుగుచూసినట్లు కేంద్రం గురువారం ప్రకటించింది. నవంబర్ 11, 20వ తేదీల్లో బెంగళూరుకు వచ్చిన ఇద్దరికి ఒమిక్రాన్ నిర్ధరణ అయినట్లు వెల్లడించారు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్​ అగర్వాల్​. వీరిలో ఒకరి వయసు 66ఏళ్లు కాగా.. మరొకరి వయసు 46 ఏళ్లని తెలిపారు. అయితే, గోప్యతను దృష్టిలో ఉంచుకొని వారి పేర్లను వెల్లడించడం లేదని అన్నారు. వీరిద్దరికీ తొలుత కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధరణ కావడం వల్ల ఆ నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ చేశామని, వారిద్దరిలో ఒమిక్రాన్‌ ఉన్నట్టు ఇన్‌సాకాగ్ నిర్ధరించినట్లు వెల్లడించారు. బాధితుల్లో తీవ్ర లక్షణాలు కనిపించలేదని తెలిపారు.

ఇదీ చూడండి: బెంగళూరులో రెండు ఒమిక్రాన్‌ కేసులు గుర్తింపు: కేంద్రం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.