ETV Bharat / international

చెవిలో బొద్దింకతో 3 రోజులు.. చివరకు... - cockroach found inside mans ear

Cockroach in Ear: ఓ వ్యక్తి చెవినే ఆవాసంగా చేసుకుంది బొద్దింక. అక్కడే 3 రోజుల పాటు ఉంది. చెవిలోకి బొద్దింక దూరడం వల్ల అతడు చాలా తిప్పలు పడ్డాడు. స్పెషలిస్ట్​ దానిని బయటకు తీయగా.. ఊపిరి పీల్చుకున్నాడు న్యూజిలాండ్​లోని ఆక్లాండ్​కు చెందిన జేన్​ వెడ్డింగ్​.

Cockroach in Ear
Cockroach in Ear
author img

By

Published : Jan 14, 2022, 3:46 PM IST

Cockroach in Ear: ఒకటి, రెండు కాదు.. ఏకంగా 3 రోజుల పాటు ఓ వ్యక్తి చెవిలో తిష్ట వేసింది ఓ బొద్దింక. నరకయాతన అనుభవించిన అతను వైద్య నిపుణుల దగ్గరకు వెళ్లగా పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాడు. వైద్యులు దానిని బయటకు తీశారు. న్యూజిలాండ్​లోని ఆక్లాండ్​లో జరిగిందీ ఘటన.

ఇదీ జరిగింది..

ఆక్లాండ్​కు చెందిన జేన్​ వెడ్డింగ్​ అనే వ్యక్తి.. పూల్​లో స్విమ్మింగ్​ చేసి వచ్చి పడుకున్నాడు. తర్వాత చెవిలో ఏదో సమస్యగా అనిపించింది. లోపలకు నీరు పోయిందేమో అని తొలుత తేలిగ్గా తీసుకున్నాడట. కాసేపటికి లోపల ఏదో తిరుగుతున్నట్లు అనిపించగా.. డాక్టర్​ దగ్గరికి వెళ్లాడు జేన్​.

అతడిని పరిశీలించిన వైద్యుడు.. యాంటీబయాటిక్స్​ ఇచ్చి, హెయిర్​ డ్రయర్​తో చెవి లోపల శుభ్రం చేసుకోవాలని సూచించాడు. మళ్లీ సమస్య అనిపిస్తే తిరిగి రావాలని చెప్పి పంపించాడు.

అయినప్పటికీ అతడి సమస్య తీరలేదు. ఓ చెవి మొత్తం వినిపించడం లేదు. నిద్ర పట్టట్లేదు. డ్రయర్​ కూడా ఏం చేయలేకపోయింది. దీంతో తప్పని పరిస్థితుల్లో చెవి స్పెషలిస్ట్​ దగ్గరకు వెళ్లాడు.

అతని చెవిని చూసిన మహిళా డాక్టర్​.. లోపల ఏదో కీటకం ఉన్నట్లు చెప్పింది. ట్వీజర్లు ఉపయోగించి చెవిలో నుంచి చనిపోయిన బొద్దింకను బయటకు తీసింది. అది చూసి షాకవ్వడం జేన్​ వంతైంది. 3 రోజులు చెవిలో బొద్దింక ఉన్న విషయాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నాడు.

ఇవీ చూడండి: 100 మందుపాతరలు గుర్తించిన ఎలుక మృతి

మైక్రోసాఫ్ట్​ కీలక నిర్ణయం- బిల్​ గేట్స్ గుట్టు రట్టు?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.