ETV Bharat / international

కొత్త మ్యాప్​కు నేపాల్​ పార్లమెంట్​ ఆమోదం.. స్పందించిన భారత్​ - భారత్ నేపాల్ వివాదం

భారత్‌ భూభాగాలైన లిపులేఖ్‌, కాలాపానీ, లింపియాధురా ప్రాంతాలను తమవిగా పేర్కొంటూ నేపాల్‌ రూపొందించిన కొత్త మ్యాప్‌కు ఆ దేశ పార్లమెంట్‌ ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లుకు దిగువ సభలో మూడింట రెండొంతుల మెజార్టీ లభించింది. అయితే ఇలాంటి కృత్రిమ మార్పులను అంగీకరించేది లేదని భారత్​ స్పష్టం చేసింది.

NEPAL-PARLIAMENT-MAP
నేపాల్​ పార్లమెంట్
author img

By

Published : Jun 13, 2020, 7:53 PM IST

వివాదాస్పద జాతీయ పటంలో మార్పులకు నేపాల్​ పార్లమెంట్ దిగువ సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. భారత్​ తనవిగా చెప్పుకొంటున్న కలాపానీ, లిపులేఖ్​ ప్రాంతాలను కలుపుకొని ఆ దేశ చిత్రపటాన్ని మార్చేందుకు వీలుగా రాజ్యాంగాన్ని సవరణకు పచ్చజెండా ఊపింది.

రాజ్యాంగ సవరణ బిల్లు కోసం నేపాల్​ పార్లమెంటు శనివారం ప్రత్యేకంగా భేటీ అయింది. రాజ్యాంగంలోని షెడ్యూల్​ 3 సవరణ బిల్లుకు ప్రధాన ప్రతిపక్షం నేపాలీ కాంగ్రెస్ సహా జనతా సమాజ్​వాదీ పార్టీ మద్దతిచ్చాయి.

2/3 మెజారిటీ..

275 మంది సభ్యులున్న దిగువ సభలో రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదానికి అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీ లభించింది. అనంతరం ఈ బిల్లును జాతీయ అసెంబ్లీకి పంపిస్తారు.

అక్కడ అధికార నేపాల్ కమ్యూనిస్టు పార్టీకి మూడింట రెండొంతుల మెజారిటీ ఉండటం వల్ల ఆమోదం లాంఛనంగానే కనిపిస్తోంది. అయితే బిల్లులో ఏవైనా నిబంధనలు మార్చేందుకు చట్టసభ్యులకు అసెంబ్లీ 72 గంటల సమయం ఇస్తుంది.

అసెంబ్లీ బిల్లును ఆమోదిస్తే ధ్రువీకరణ కోసం రాష్ట్రపతికి బిల్లును సమర్పిస్తారు. అక్కడా ఆమోదం లభిస్తే రాజ్యాంగంలో పొందుపరుస్తారు.

కృత్రిమ మార్పులు అంగీకరించేది లేదు: భారత్​

భారత్​-నేపాల్​ సరిహద్దులకు సంబంధించి ఎలాంటి కృత్రిమ మార్పులను అంగీకరించేది లేదని భారత్​ స్పష్టం చేసింది. నేపాల్ రూపొందించిన మ్యాప్​న​కు ఎలాంటి చారిత్రక ఆధారాలు లేవని గుర్తు చేసింది. సరిహద్దు సమస్యను ద్వైపాక్షిక చర్యలు ద్వారా పరిష్కరించుకోవాలనే భావనకు విరుద్ధంగా నేపాల్ చర్యలున్నాయని మండిపడింది భారత్.

వివాదం ఇదీ..

మూడు దేశాల సరిహద్దులు కలిసే లిపులేఖ్​లో​ భారత్​ రహదారి ప్రారంభించడాన్ని నేపాల్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఇందుకు ప్రతిగా లిపులేక్, కాలపానీ, లింపియాధురా ప్రాంతాలను తమ భూభాగాలు చూపిస్తూ కొత్త జాతీయ పటాన్ని రూపొందించింది. ప్రధాన ప్రతిపక్షం నేపాలీ కాంగ్రెస్ కూడా దీనికి మద్దతు ఇస్తున్నట్లు ఇంతకు ముందే ప్రకటించింది.

ఇదీ చూడండి: నేపాల్​ కొత్త మ్యాపునకు ఆమోదం లాంఛనమే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.