బ్యాంక్‌కు వచ్చిన ఓ చైనీస్ మిలియనీర్‌కు అక్కడి సిబ్బంది తీరుతో చిర్రెత్తుకొచ్చింది. కోపంతో తన ఖాతాలో ఉన్న ఐదు మిలియన్ల యువాన్లు విత్‌డ్రా చేశాడు. మన రూపాయాల్లో చెప్పాలంటే రూ.5.8 కోట్లు. డ్రా చేసిన డబ్బుని బ్యాగుల్లో కుక్కుకొని వెళ్లిపోలేదా ఆసామి. అందులో ఏదో తేడా ఉందని చెప్పి ఆ మొత్తాన్ని తన కళ్లముందే లెక్క పెట్టాలన్నాడు. ఇదేం బాధరా నాయనా అనుకుంటూ స్టాఫ్ అంతా కలిసి పొద్దంతా కష్టపడి లెక్క అప్పజెప్పారు. కట్టలకొద్దీ నోట్లను ఒక్కొక్కటిగా లెక్కించారు.
కథ అంతటితో ముగిసిపోలేదు. 'రోజుకు ఐదు మిలియన్ల యువాన్ల పరిమితి నిబంధన ఉండటంతో ఈరోజు ఇంతటితో వదిలేశాను. రేపొచ్చి నా ఖాతా మొత్తం ఖాళీ చేస్తాను' అని బ్యాంకు సిబ్బందికి వార్నింగ్ కూడా ఇచ్చాడు ఆ మిలియనీర్. ఈ ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అయ్యాయి. ఇంతకీ 'సన్‌వేర్' అనే ఆ ధనికుడి కోపానికి కారణం ఏంటో తెలుసా? బ్యాంక్‌కు వచ్చినప్పుడు మాస్కు ధరించమని అక్కడి భద్రతా సిబ్బంది తనకి కొంచెం దురుసుగా చెప్పాడట.
ఇదీ చూడండి: స్పెయిన్ బుల్ రన్లో ఉద్రిక్తత.. అంతలోనే..!