ETV Bharat / international

జైలులో అగ్నిప్రమాదం- 41 మంది ఖైదీలు మృతి - indonesia jail fire

indonesia prison fire
ఇండోనేసియా జైలు అగ్నిప్రమాదం
author img

By

Published : Sep 8, 2021, 8:17 AM IST

Updated : Sep 8, 2021, 10:37 AM IST

08:15 September 08

జైలులో అగ్నిప్రమాదం- 41 మంది ఖైదీలు మృతి

FGN8-NEWSALERT-INDONESIA-PRISON-FIRE
ఘటన జరిగిన జైలు బయటి గేటు వద్ద సిబ్బంది..

ఇండోనేసియాలోని ఓ జైలులో సంభవించిన భారీ అగ్ని ప్రమాదంలో (Indonesia prison fire ) 41 మంది ఖైదీలు మరణించారు. మరో 80 మంది తీవ్రంగా గాయపడ్డారు. జకార్తా శివార్లలోని టాంగెరాంగ్ జైలులోని సీ బ్లాక్​లో ఈ ఘటన జరిగింది. మృతులంతా మాదకద్రవ్యాల కేసుల్లో పట్టుబడ్డవారేనని తెలుస్తోంది.

అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. అయితే, షార్ట్ సర్క్యూట్ వల్లే ఘటన జరిగిందని ప్రాథమికంగా భావిస్తున్నారు. మంటలను ఆర్పేందుకు వందల మంది పోలీసులు, సైనికులను మోహరించారు. గంటల పాటు శ్రమించి మంటలను ఆర్పేసినట్లు న్యాయ శాఖ ప్రతినిధి రికా అప్రియాంతి చెప్పారు. బాధితులను ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు.

కారాగారం సామర్థ్యం 1225 కాగా ఇందులో రెండు వేలకుపైగా ఖైదీలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అగ్నిప్రమాదం సమయంలో సీ బ్లాక్​లో 122 మంది దోషులు ఉన్నారని చెప్పారు. 

ఇదీ చదవండి: భాజపా ఎంపీ ఇంటిపై బాంబు దాడి- గవర్నర్ ఆందోళన

Last Updated : Sep 8, 2021, 10:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.