ETV Bharat / international

భారత్​ను దెబ్బతీసేందుకు పాక్​ 'అణు' కుట్రలు! - పాకిస్థాన్​ అణు సంపత్తి

సమయం చూసి భారత్​ను దెబ్బకొట్టేందుకు ఎప్పుడూ ఎదురుచూస్తుంది పాకిస్థాన్​. తన వద్ద ఉన్న సాంకేతికతను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటోంది. ఈ క్రమంలోనే జర్మనీ నుంచి సామూహిక విధ్వంసకర ఆయుధాల సాంకేతికతను పొందేందుకు ప్రయత్నిస్తోంది. ఈ విషయాన్ని జర్మనీలోని సార్​ల్యాండ్​ రాష్ట్ర నిఘా నివేదికను విడుదల చేసింది.

German intel exposes nefarious Pak designs
భారత్​ను దెబ్బతీసేందుకు పాక్​ 'అణు' అక్రమాలు
author img

By

Published : Sep 2, 2020, 3:49 PM IST

భారత్​పై పైచేయి సాధించడానికి నిరంతరం శ్రమించే పాకిస్థాన్​.. ఈసారీ పెద్ద ప్రణాళికనే రచించింది. భారత్​ను ఎలాగైనా దెబ్బతీయాలనే లక్ష్యంతో.. సామూహిక విధ్వంసకర ఆయుధాల(డబ్ల్యూఎమ్​డీ) సాంకేతికతను తమకు ఇవ్వమని జర్మనీని కోరింది​. ఈ విషయాన్ని జర్మనీలోని సార్​ల్యాండ్ రాష్ట్రం తన నిఘా నివేదికలో పేర్కొంది.

జర్మనీలో పాకిస్థాన్ అక్రమ అణ్వాయుధ​ కార్యకలాపాలను ఈ 'ఓవర్​వ్యూ ఆఫ్​ ద సిచ్యువేషన్​' నివేదిక ప్రస్తావించింది. ఈ నివేదికకు సంబంధించిన కాపీని ఇజ్రాయెల్​కు చెందిన జెరుసలేం పోస్ట్​ వార్తా పత్రిక సంపాదించింది.

"శత్రు దేశం భారత్​పై తమ సామర్థాన్ని పెంపొందించుకునేందుకు పాకిస్థాన్​ విస్తృతంగా అణు కార్యకలాపాలను సాగిస్తోంది. వాటిని ఎప్పటికప్పుడు విస్తరిస్తోంది, ఆధునీకరిస్తోంది. నిజానికి.. కావాల్సినంత సాంకేతికత ఇప్పటికే పాకిస్థాన్​ వద్ద ఉంది. కానీ పరికరాలను నియంత్రించడం వంటి సాంకేతికత కోసం విదేశాలపై పాక్ ఆధారపడాల్సి వస్తోంది​."

--- సార్​ల్యాండ్ నిఘా విభాగం నివేదిక

ఇదీ చూడండి:- ఆ ప్రకటనలు పచ్చి అబద్ధాలు- పాక్​పై భారత్​ ఫైర్​

పాకిస్థాన్​తో పాటు ఇరాన్​, సిరియా కూడా ఈ డబ్ల్యూఎమ్​డీ కోసం జర్మనీని సంప్రదించినట్టు నివేదిక పేర్కొంది.

"జర్మనీలోని వేరువేరు స్థాయిల్లో ఈ దేశాల నిఘా వ్యవస్థకు చెందిన ప్రతినిధులు ఉంటారు. వీరు అక్కడ దౌత్యవేత్తగానో, జర్నలిస్టుగానో పనిచేస్తూ ఉంటారు. సంబంధిత వర్గాల నుంచి సమాచారాన్ని సేకరిస్తూ ఉంటారు. లేదా.. స్వదేశంలోని నిఘా కార్యాలయం ప్రత్యక్షంగా నిర్వహించే ఆపరేషన్లకు వీరు సహాయం చేస్తూ ఉంటారు. అదే సమయంలో ప్రస్తుత రాజకీయ అవసరాలు, ఆర్థిక ప్రాధాన్యాలను దృష్టిలో పెట్టుకుని వీరి కొనుగోళ్ల కార్యకలాపాలు ఉంటాయి."

---- సార్​ల్యాండ్ నిఘా విభాగం నివేదిక

మరోవైపు.. పాకిస్థాన్​ వంటి దేశాలు.. అణు, జీవ, రసాయన ఆయుధాల సంపత్తిని పెంచుకునేందుకు.. జర్మనీలో ఎలాంటి అక్రమాలకు పాల్పడతారనే అంశంపై బడెన్​-ఉట్టెమ్​బర్గ్​ రాష్ట్ర నిఘా సంస్థ ఓ నివేదికను విడుదల చేసింది. అత్యాధునిక సాంకేతికతలు, కంపెనీలు ఉండటం వల్ల ఆయా దేశాలకు జర్మనీ ఎందుకింత ముఖ్యమనే విషయాన్ని వివరించింది.

దీంతో... ఓవైపు ఉగ్రమూకలకు ఆశ్రయమిస్తూనే.. ఎఫ్​ఏటీఎఫ్​ నుంచి నిషేధాన్ని తప్పించుకునేందుకు పాకిస్థాన్​ చేస్తున్న కుట్రలను జర్మనీ మరోమారు బయటపెట్టినట్టు అయ్యింది.

ఇదీ చూడండి:- పాక్​ సైన్యం కాల్పులు- భారత జవాను మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.