ETV Bharat / international

బంగ్లాదేశ్​లో ఆలయాలపై దాడులు- అల్లర్లలో నలుగురు మృతి

హిందూ దేవాలయాలపై (Bangladesh Temple Attack) దాడుల నేపథ్యంలో బంగ్లాదేశ్​లో పెద్ద ఎత్తున అలర్లు చెలరేగాయి. దీంతో 22 జిల్లాల్లో సరిహద్దు దళాలు, పారా మిలటరీ బలగాలను మోహరించింది ప్రభుత్వం.

Bangladesh Temple Attack
దేవాలయాలపై దాడులు
author img

By

Published : Oct 14, 2021, 5:17 PM IST

Updated : Oct 18, 2021, 6:48 PM IST

దసరా వేడుకల వేళ బంగ్లాదేశ్​లోని పలు ప్రాంతాల్లో హిందూ దేవాలయాలను ధ్వంసం చేశారు (Bangladesh Temple Attack) గుర్తు తెలియని ఛాందసవాదులు. ఈ నేపథ్యంలో చెలరేగిన అల్లర్లలో బుధవారం నలుగురు చనిపోయారు. అనేక మంది గాయపడ్డారు. హింసను అరికట్టేందుకు 22 జిల్లాల్లో పారామిలటరీ దళాలను గురువారం మోహరించింది ఆ దేశ ప్రభుత్వం.

కూమిల్లా నగరంలోని స్థానిక ఆలయాన్ని ధ్వంసం (Hindu Temple Vandalised) చేశారనే వార్తలు బుధవారం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. ఫలితంగా ఆ ప్రాంతంలో నిరసనలు చెలరేగడం వల్ల ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులు పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నించారు.

పోలీసులతో ఘర్షణ..!

ఈ క్రమంలో ఛాందసవాదులు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణల్లో ముగ్గురు చనిపోగా, గాయాల కారణంగా అనంతరం మరొకరు మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కాల్పులు జరిగిన హాజిగంజ్​లో ర్యాలీపై అధికారులు నిషేధం విధించారు. అధికారులపై దుండగులు దాడికి పాల్పడ్డారని, తమ వాహనాలను ధ్వంసం చేశారని పోలీసులు తెలిపారు. పోలీసుల చర్యల కారణంగా మరణాలు సంభవించాయా అనే దానిపై వారు ఎలాంటి వివరణ ఇవ్వలేదు. అయితే 500 మందికి పైగా ఉన్న జనసమూహంలోకి పోలీసులు కాల్పులు జరిపినట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

బలగాల మోహరింపు..

చాంద్​పుర్, ఛత్తోగ్రామ్​లోనూ దుండగులు దేవాలయాల విధ్వంసానికి (Bangladesh Temple Attack) పాల్పడినట్లు తెలుస్తోంది. ఒకానొక సమయంలో పరిస్థితి చేయి దాటి పోయి దుర్గా పూజ జరిగే అనేక ప్రాంతాలకు అల్లర్లు విస్తరించాయి. పరిస్థితిని అదుపు చేసేందుకు బంగ్లాదేశ్​ పోలీస్, ర్యాపిడ్ యాక్షన్ బెటాలియన్ సహా బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ దళాలు రంగంలోకి దిగాయి.

సువేందు లేఖ..

అల్లర్ల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు బంగాల్​ భాజపా నేత సువేందు అధికారి. బంగ్లాదేశ్​లో సనాతని ప్రజలపై ఏళ్లుగా దాడులు జరుగుతున్నాయని, వారికి ఉపశమనం కలిగించేందుకు అవసరమైన చర్యలను సత్వరం చేపట్టాలని కోరారు.

ఇదీ చూడండి: కృష్ణాష్టమి నాడే పాక్​లో హిందూ ఆలయం ధ్వంసం

Last Updated : Oct 18, 2021, 6:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.