అఫ్గానిస్థాన్‌ను(afghanistan news) తమ గుప్పిట్లో తీసుకున్న తాలిబన్లు.. ఇప్పుడు డ్రగ్స్‌కు అలవాటుపడినవారిపై ప్రత్యేక దృష్టిపెట్టారు. కాబుల్ వీధుల్లో మత్తు బానిసలను పట్టుకుని బలవంతంగా డ్రగ్ ట్రీట్మెంట్ సెంటర్లకు తరలిస్తున్నారు(taliban news).


కాబుల్‌లో డ్రగ్స్ తీసుకునే వారి సంఖ్య కాస్త ఎక్కువే! ఇందులో పేదలే ఎక్కువగా ఉంటారు. వీరందరూ హెరాయిన్ వంటి డ్రగ్స్ సేవించి.. చెత్తకుప్పల పక్కన, వంతనెల కింద, మురుగు నీటి దగ్గర పడి ఉంటారు. ఇలాంటి వారిపై తాలిబన్ల కన్నుపడింది. వీళ్లని చికిత్సా కేంద్రాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. కొంత వ్యతిరేకత ఎదురైనా చంపేస్తున్నారు.


కాబుల్‌లోని ఫీనిక్స్ క్యాంప్‌నకు వీరిని తరలిస్తున్నారు. 1000మందికిపైగా రోగులకు చికిత్స అందించే సామర్థ్యం దీనికి ఉంది. అక్కడ.. రోగులను బట్టులు తీయించి, నగ్నంగా స్నానం చేయిస్తున్నారు. గుండు కొట్టిస్తున్నారు. కొందరికి భోజనం కూడా పెట్టడం లేదు. ఎందుకు అని ప్రశ్నిస్తే.. 'ఇదీ చికిత్సలో భాగమే' అంటున్నారు అక్కడి వైద్యులు.




ఇదీ చూడండి:- పోలీసులుగా మారిన తాలిబన్లు- వీధుల్లో తుపాకులతో పహారా