ETV Bharat / international

కరోనా పంజా: ప్రపంచవ్యాప్తంగా 90వేలు దాటిన మరణాలు

author img

By

Published : Apr 10, 2020, 5:44 AM IST

కరోనా ధాటికి ప్రపంచదేశాలు అల్లాడిపోతున్నాయి. కరోనా బాధితుల సంఖ్య 16 లక్షలకు చేరువకాగా మృతుల సంఖ్య 90 వేలు దాటింది. వ్యాధి బారి నుంచి 3లక్షల 55వేల మంది కోలుకున్నారు. బ్రిటన్​లో మరణాలు కొనసాగుతుండగా.. ఫ్రాన్స్​, స్పెయిన్​ దేశాల్లో మహమ్మారి కాస్త తగ్గుముఖం పట్టింది. ​

Corona claw: Deaths crossing 90,000 worldwide
కరోనా పంజా: ప్రపంచవ్యాప్తంగా 90వేలు దాటిన మరణాలు

ప్రపంచదేశాలపై కరోనా పంజా విసురుతోంది. ఇప్పటివరకు మొత్తం 90,938 మంది వైరస్​ బారినపడి మరణించగా.. బాధితుల సంఖ్య 16 లక్షలకు చేరువలో ఉంది. ఇటలీ, స్పెయిన్​, అమెరికా, ఫ్రాన్స్​, బ్రిటన్​ దేశాల్లో కరోనా విలయతాండవం చేస్తోంది.

881 మంది మృతి..

బ్రిటన్​లో మరో 881 కరోనా మరణాలు సంభవించాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 7,978 మంది వైరస్​కు బలయ్యారు. కరోనా సోకి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బ్రిటన్​ ప్రధాని బోరిస్​ జాన్సన్​​ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతోందని అధికారులు పేర్కొన్నారు. ఆయన్ను ఐసీయూ నుంచి సాధారణ వార్డ్​కు తరలించారు. దేశంలో మొత్తం కేసులు 65,077కు చేరాయి.

తగ్గుదల..

స్పెయిన్‌లో కరోనా మృత్యుఘోష గురువారం కాస్త తగ్గింది. దేశంలో వైరస్​ కారణంగా నిన్న 683 మంది మరణించారు. బుధవారం చనిపోయిన 757మందితో పోలిస్తే.. ఈ సంఖ్య తక్కువే. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 15,238 మంది ప్రాణాలను వైరస్​ బలిగొంది. వీటితో పాటు వైరస్​ నిర్ధరణ కేసులూ గురువారం తగ్గినట్లు అధికారులు తెలిపారు.

ఇప్పటి వరకు మొత్తం 1,52,446 మందికి మహమ్మారి సోకినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ప్రజలంతా వైరస్​ వ్యాప్తికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగించాలని ప్రధాని పెడ్రో శాంచైజ్​ తెలిపారు.

కేవలం 82 మంది ఇంటెన్సీవ్​ కేర్​లో..

ఫ్రాన్స్​లో తొలిసారి వైరస్​తో బాధపడుతున్న వారి సంఖ్య తగ్గిందని అధికారులు తెలిపారు. అంతకుముందు రోజుతో పోలిస్తే.. గురువారం 82 మందే ఇంటెన్సీవ్​ కేర్​లో ఉన్నట్లు పేర్కొన్నారు. మొత్తం 7,066 మంది రోగులు అత్యవసర చికిత్స పొందుతున్నారు. దేశవ్యాప్తంగా వైరస్​ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 12,210కి చేరింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.