ETV Bharat / international

2019లో కొవిడ్‌ వ్యాప్తికి ముందే చైనా ఏర్పాట్లు..! - వుహాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ

కొవిడ్-19 వైరస్‌ చైనాలోని వుహాన్​లో పుట్టిందనే ఆరోపణల నేపథ్యంలో తాజాగా మరో అంశం తెరపైకి వచ్చింది. ఈ మేరకు కరోనా విజృంభణకు ముందే చైనాలోని పలు ప్రావిన్స్​లు భారీగా నిర్ధరణ పరీక్ష పరికరాల(పీసీఆర్‌) కొనుగోళ్లు చేశాయని ఓ పరిశోధన వెలుగులోకి వచ్చింది. మరి ఈ ఆరోపణల్లో నిజమెంత..?

china rtpcr
చైనా
author img

By

Published : Oct 6, 2021, 7:10 AM IST

కరోనా వైరస్‌ వ్యాప్తి విషయంలో చైనా తీరు ఆది నుంచి అనుమానాస్పదంగానే ఉంది. చాలా రోజులపాటు వైరస్‌ వ్యాప్తి విషయాన్ని చైనా కప్పిబెట్టి ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించిందనే వాదనకు బలం చేకూర్చే సాక్ష్యాలను ఓ సంస్థ వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ సంస్థ పరిశోధన ప్రకారం వుహాన్లో తొలికేసు వెలుగులోకి రావడానికి కొన్ని నెలల ముందు నుంచే అక్కడి ల్యాబ్‌లు పీసీఆర్‌ పరీక్ష పరికరాలను భారీగా కొనుగోలు చేసినట్లు తేలింది. ఆస్ట్రేలియా-అమెరికాకు చెందిన 'ఇంటర్నెట్‌ 2.0' అనే సంస్థ ఈ పరిశోధన నిర్వహించింది. ఈ సైబర్‌ సెక్యూరిటీ సంస్థ డిజిటల్‌ ఫోరెన్సిక్‌ అండ్‌ ఇంటెలిజెన్స్‌ ఎనాలసిస్‌లో అందెవేసిన చేయి.

2019 ద్వితీయార్థం నుంచే భారీగా కొనుగోళ్లు..

ప్రపంచ ఆరోగ్య సంస్థకు 2019 డిసెంబర్‌ 31 తేదీన చైనా తొలిసారి కొత్త వైరస్‌ గురించి సమాచారం అందజేసింది. జనవరి7వ తేదీ ఇది కరోనా కొత్తరకం అయిన సార్స్‌కోవ్‌-2గా తేల్చారు. మరోపక్క 2019లోనే చైనా దేశంలోని వివిధ ప్రాంతాల్లో భారీ సంఖ్యలో పాలిమర్‌ చైన్‌ రీయాక్షన్‌ పరీక్షల సామగ్రిని కొనుగోలు చేసింది. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఈ కొనుగోళ్ల పెరుగుదల 50శాతం వరకు ఉంది.

వుహాన్‌లోని పలు ల్యాబోరేటరీలు 2019లో ఈ పరికరాల కోసం 135 కాంట్రాక్టులను ఇచ్చాయి. అదే 2018లో 89, 2017లో 72 గా ఉన్నాయి. 2015 నుంచి 2019 వచ్చేనాటికి పీసీఆర్‌ పరికరాల కొనుగోళ్లలో 600శాతం పెరిగాయి. కొవిడ్‌ వ్యాప్తికి ఐదు నెలల ముందు జులైలో భారీ కొనుగోళ్లు జరిగాయి. ఒక వ్యక్తికి ఇన్ఫెక్షన్‌ సోకిందో లేదో తెలుసుకోవడానికి జన్యువుల ఆధారంగా ఈ పరీక్షను చేస్తారు. కొవిడ్‌ను గుర్తించేందుకు భారీ ఎత్తున వీటిని వినియోగించారు.

పీసీఆర్‌ పరికరాల కొనుగోళ్లలో పెరుగుదల ఆధారంగా ఇంటర్నెట్‌2.0 ఒక అభిప్రాయానికి వచ్చింది. చైనా కొవిడ్‌19 గురించి బాహ్యప్రపంచానికి వెల్లడించిన దాని కంటే కొన్ని నెలల ముందే వైరస్ వ్యాప్తి ప్రారంభమై ఉండొచ్చని అభిప్రాయపడింది. కానీ, వైద్య నిపుణుల వాదన మాత్రం భిన్నంగా ఉంది. కేవలం పీసీఆర్‌ పరీక్ష పరికరాలు కొనుగోళ్ల ఆధారంగా ఏ నిర్ణయానికి రాలేమని అంటున్నారు. వివిధ రకాల వైరస్‌లను కనుగొనడానికి దీనిని వాడుతుంటారు. పీసీఆర్‌ పరికరాల కొనుగోళ్లపై జాన్‌హాప్‌కిన్స్‌ విశ్వవిద్యాలయానికి చెందిన స్కాలర్‌ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ కిట్ల కొనుగోళ్లు ఒక్క హుబే ప్రావిన్స్‌లోనే ఎందుకు పెరిగాయో అర్థం కాలేదన్నారు. కాకపోతే ప్రతిఏటా పీసీఆర్‌ పరికరాల కొనుగోళ్లను చైనా పెంచుకొంటూ పోతోందని చెప్పారు.

చైనా డేటానే ఆధారం..!

ఈ పరిశోధనకు ఇంటర్నెట్‌2.0 కో చీఫ్‌ ఎగ్జిక్యూటీవ్‌ ఆఫీసర్‌ డేవిడ్‌ రాబిన్సన్‌ నేతృత్వం వహించారు. ఈయనకు గతంలో ఆస్ట్రేలియా సైన్యంలో పనిచేసిన అనుభవం ఉంది. ఈ పరిశోధనపై ఆయన మాట్లాడుతూ "ఈ డేటా కొవిడ్‌ పుట్టుకకు సంబంధించి ఏ వాదనను సమర్థించేందుకు కాదు" అని పేర్కొన్నారు. హుబే ప్రావిన్స్‌లో వీటి కొనుగోళ్లు అసాధారణంగా ఉన్నాయన్నారు. ఈ పరిశోధనకు చైనా అధికారిక వెబ్‌సైట్‌లో ప్రభుత్వం కొనుగోళ్ల డేటాను వాడుకొన్నారు. ఈ నేపథ్యంలో ఇంటర్నెట్‌ 2.0 పీసీఆర్‌ అనే పదం కోసం వెతికి వివరాలను సేకరించారు. 2007 నుంచి 2019 వరకు ఉన్న 1,716 కొనుగోలు కాంట్రాక్టులను గుర్తించారు. దీంతోపాటు వివిధ ప్రావిన్స్‌లు కొనుగోలు చేసిన వివరాలను కూడా సమీకరించారు. దీని ఆధారంగా హుబే ప్రావిన్స్‌తో పోలిస్తే మిగిలిన ప్రావిన్స్‌ల్లో పీసీఆర్‌ పరికరాల కొనుగోళ్లు పెద్దగా పెరగలేదని తేల్చారు.

2019లో వుహాన్ యూనివర్శిటీ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ హుబే ప్రావిన్స్‌లో అత్యధికంగా ఈ పరికరాలను కొనగోలు చేసినట్లు గుర్తించారు. ఈ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఎనిమిది ఆసుపత్రులు, 35 బోధనాసుపత్రులు, 22 జనరల్‌ ఆసుపత్రులు, 10 డిసీజ్‌ ప్రివెన్షన్‌ సెంటర్లు ఉన్నాయి.

సైనిక క్రీడల తర్వాత..

పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ ఎయిర్‌బార్న్‌ హాస్పటల్‌ 2019లో భారీగా పీసీఆర్‌ పరికరాలు కొనుగోలు చేసింది. ఆ తర్వాత సెప్టెంబర్‌లో వుహాన్‌ హంగ్‌షాన్‌ డిస్ట్రిక్‌ సెంటర్‌ కొనుగోలు చేసింది. దీనిని తర్వాత నెలలో జరగనున్న సైనిక క్రీడల కోసం కొనుగోలు చేశారు. అక్టోబర్‌లో 100 దేశాల నుంచి 9 వేల మంది సైనిక క్రీడాకారులు వుహాన్‌ వచ్చారు. ఆ తర్వాత వారు స్వదేశాలకు వెళ్లాక కొవిడ్‌ లక్షణాలతో బాధపడినట్లు వాషింగ్టన్‌ పోస్ట్‌ జూన్‌లో కథనం వెలువరించింది. చైనా మాత్రం అమెరికా సైనికులే ఈ వ్యాధిని వుహాన్‌లో వ్యాప్తి చేశారని ఆరోపించింది. నవంబర్‌లో భారీగా కొనుగోళ్లు జరిగినట్లు ఇంటర్నెట్‌ 2.0 పేర్కొంది.

ఈ పరిశోధనపై చైనా విదేశాంగ శాఖ స్పందించింది. వైరస్‌ పుట్టుక విషయంలో నమ్మటానికి వీల్లేని వాదనల కేటగిరిలోకి ఇది వస్తుందని ఆరోపించింది. గతంలో పరిశోధనల పేరిట వుహాన్‌ ఆసుపత్రుల వద్ద ట్రాఫిక్‌ విశ్లేషించామని చెప్పుకొనేవి, ఇంటర్నెట్‌లో వుహాన్‌ వాసులు దగ్గు, డయేరియా అనే పదాలను ఎక్కువగా వెతికారనే కారణంగా 2019 ఆగస్టులోనే వుహాన్‌లో కరోనా వ్యాప్తి జరిగిందని చెప్పుకొనే వాటి కేటగిరిలోకి వస్తాయని పేర్కొంది. "వైరస్‌ ఆనవాళ్లు గుర్తించడమనేది సైన్స్‌కు చెందిన ఒక సీరియస్‌ అంశం. దీనిపై శాస్త్రవేత్తలు మాత్రమే మాట్లాడలి" అని చైనా ప్రతినిధి పేర్కొన్నారు. 'దీనికి సంబంధించిన విషయాలు స్పష్టంగా ఉన్నాయి. కాలమే దీనికి సమాధానం చెబుతుంది' అని పేర్కొన్నారు. ఈ కొనుగోలు చేసిన పరికరాలను ఎక్కడ వినియోగించారో చెప్పక పోవడం గమనార్హం.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.