మీరు ఎప్పుడైనా మెక్‌డొనాల్డ్స్‌కి వెళ్లారా? వెళితే.. బిల్ ఎంత చేసుంటారు? మహా అయితే రూ. 500. ఇంకా ఎక్కువ అనుకుంటే రూ. 700. స్నేహితులతో కలిసి వెళితే ఇంకో రూ. 1000 వేసుకుందాం. కానీ ఓ వ్యక్తి.. మెక్‌డీలో ఏకంగా రూ. 1.8లక్షల బిల్లు చేశాడు. అతను ఇచ్చిన ఆర్డర్ చూసి అక్కడి సిబ్బందే షాక్ అయ్యారు.
ఆర్డర్ ఇలా!
ఆస్ట్రేలియాలో జరిగిందీ సంఘటన. ఓ వ్యక్తి మెక్‌డీలో భారీ ఆర్డర్ ఇచ్చాడు. 300కుపైగా బర్గర్లు, 100కుపైగా కూల్‌డ్రింక్స్, 70 ఆన్గస్ క్లబ్‌హౌజ్ బర్గర్లు, 39 మెక్ఫ్యామిలీ బాక్సులు(ఇందులో 234 బర్గర్లు ఉంటాయి), 69 లార్జ్ ఫ్రెంచ్ ఫ్రైస్, 2 స్మాల్ ఫ్రైస్ ఓ చిన్న వెనీలా కోక్, ఓ చీస్బర్గర్.. అతను ఇచ్చిన ఆర్డ్ర్లో ఉన్నాయి. వీటి ధర దాదాపు రూ. 1.86లక్షలు.
సాధారణంగా.. అంత మొత్తం బిల్లును చూస్తే రెస్టారెంట్ మేనేజర్లు సంబరపడిపోతారు. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయ్యింది. అంత భారీ ఆర్డర్‌ను అనుకున్న సమయానికి అందివ్వడం సాధ్యమయ్యే పనికాదని మెక్‌డీ సిబ్బంది తేల్చి చెప్పేశారు. కొంచెం కొంచెం తయారు చేసినా, అవి వెచ్చగా ఉండకపోతే తినడానికి పనికిరావని అభిప్రాయపడ్డారు.
ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 'ఇంత భారీ ఆర్డర్ ఏం చేసుకుంటాడు?' అని కొందరు ప్రశ్నిస్తుంటే.. 'ఇలాంటి ఆర్డర్లు చూస్తే సిబ్బంది పారిపోతారేమో' అని ఇంకొందరు అంటున్నారు.
ఇదీ చూడండి:- Olympics: ఒలింపిక్స్ వల్ల మెక్ డొనాల్డ్స్‌కు భారీ నష్టం!