ETV Bharat / international

'గాలి ద్వారా కరోనా వ్యాప్తి నిజమే - కానీ..' - గాలి ద్వారా కరోనా సోకుతుంది డబ్ల్యూహెచ్​ఓ

గాలి ద్వారా కరోనా వైరస్ సోకే అవకాశముందని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లోనే ఈ సంక్రమణకు అవకాశం ఉందని వెల్లడించింది.

WHO: Indoor airborne spread of coronavirus possible
గాలిద్వారా కరోనా వ్యాపించే పరిస్థితులను గుర్తించిన డబ్ల్యూహెచ్​ఓ
author img

By

Published : Jul 10, 2020, 1:45 AM IST

Updated : Jul 10, 2020, 7:30 AM IST

కొన్ని పరిస్థితుల్లో గాలి ద్వారా కరోనా వైరస్ వ్యాప్తించే అవకాశం ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) గుర్తించింది. జనసమ్మర్ధం అధికంగా కలిగిన గదిలాంటి ప్రాంతాలు, ఇన్ఫెక్షన్​ సోకిన వ్యక్తులు ఉండి.. సుదీర్ఘకాలం పాటు గాలి, వెలుతురు సరిగా లేని గదులలో వైరస్ గాలి ద్వారా విస్తరించే అవకాశమున్నట్లు పేర్కొంది.

ఇటీవల 200 మందికిపైగా శాస్త్రవేత్తలు.. గాలి ద్వారా వైరస్​ వ్యాపిస్తుందంటూ డబ్ల్యూహెచ్​ఓకు లేఖ రాశారు. అందుకు అనుగుణంగా మార్గదర్శకాలను, సంరక్షణ చర్యలను సవరించాలని అందులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే గాలి ద్వారా కరోనా వ్యాపించే అవకాశాలున్నట్లు డబ్ల్యూహెచ్​ఓ తెలిపింది.

అంతేకాకుండా లక్షణాలు లేకుండానే కొవిడ్​-19ను వ్యాప్తి చేసే వ్యక్తుల వైఖరిని కూడా డబ్ల్యూహెచ్​ఓ గుర్తించింది. వ్యాధి లక్షణాలు కనిపించకుండానే వైరస్​ వ్యాప్తి గణనీయంగా వృద్ధిచెందడానికి కారణమవుతోందని అభిప్రాయపడింది డబ్ల్యూహెచ్​ఓ.

ఇదీ చదవండి: కరోనాను ఖతం చేసే యంత్రం ఆవిష్కరణ!

Last Updated : Jul 10, 2020, 7:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.