ETV Bharat / international

ట్రంప్​ అలా చేస్తే కష్టాలు తప్పవు: డబ్ల్యూహెచ్​ఓ

డబ్ల్యూహెచ్​ఓకు శాశ్వతంగా నిధులు నిలిపివేస్తామని అమెరికా హెచ్చరించడంపై ఆ సంస్థలోని అత్యవసర విభాగాధిపతి డా. మైకెల్​ ర్యాన్​ ఆందోళన వ్యక్తం చేశారు. అగ్రరాజ్యం అలా చేస్తే ప్రపంచంలోని బలహీన వర్గాలకు అత్యవసర ఆరోగ్య సేవలు అందించడంలో జాప్యం జరుగుతుందన్నారు.

WHO doctor says no U.S. funding would be hurtful
ట్రంప్​ అలా చేస్తే కష్టాలు తప్పవు: డబ్ల్యూహెచ్​ఓ
author img

By

Published : May 21, 2020, 9:04 AM IST

ఓవైపు కరోనా వైరస్​ విజృంభిస్తుంటే.. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్​ఓ)కు అమెరికా శాశ్వతంగా నిధులను నిలిపివేస్తామని హెచ్చరించడం తీవ్రంగా కలవరపెడుతోంది. దీని వల్ల ప్రపంచంలోని బలహీన వర్గాలకు అత్యవసర ఆరోగ్య సేవలు అందించడంలో అనేక ఇబ్బందులు ఎదురవుతాయని డబ్ల్యూహెచ్​ఓ ఆవేదన వ్యక్తం చేస్తోంది.

ఈ విషయంపై డబ్ల్యూహెచ్​ఓలోని అత్యవసర విభాగాధిపతి డా. మైకెల్​ ర్యాన్​ ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా అందించే నిధులను ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సేవల కోసం ఉపయోగిస్తామని పేర్కొన్నారు. నిధుల కొరతను పూడ్చడానికి ఇతరులతో కలిసి పనిచేయాల్సి వస్తుందని వెల్లడించారు.

మునుపెన్నడూ లేనంతగా 24 గంటల వ్యవధిలో ప్రపంచవ్యాప్తంగా 1,06,000 కేసులు నమోదైన నేపథ్యంలో డా.మైకెల్​ ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థకు అత్యధికంగా నిధులు అందించేది అమెరికానే. ప్రపంచాన్ని కరోనా గడగడలాడిస్తోన్న నేపథ్యంలో డబ్ల్యూహెచ్​ఓపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ విరుచుకుపడ్డారు. వైరస్​ అంశంలో డబ్ల్యూహెచ్​ఓను.. చైనా కీలుబొమ్మగా అభివర్ణించారు. నిధులను నిలిపివేస్తామని హెచ్చరించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.