ETV Bharat / international

చైనా చేతిలో డబ్ల్యూహెచ్​ఓ ఓ కీలుబొమ్మ: ట్రంప్​ - చైనా చేతిలో డబ్ల్యూహెచ్​ఓ కీలుబొమ్మ

చైనా చేతిలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఓ కీలుబొమ్మ అని ఘాటుగా విమర్శించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. చైనా నుంచి వచ్చే వారిని నిషేధించినప్పుడు డబ్ల్యూహెచ్​ఓ వ్యతిరేకించిందని.. కానీ ఆ నిర్ణయంతో కొన్ని వేల ప్రాణాలు కాపాడినట్టు పేర్కొన్నారు.

WHO a puppet of China: Trump
చైనా చేతిలో డబ్ల్యూహెచ్​ఓ ఓ కీలుబొమ్మ: ట్రంప్​
author img

By

Published : May 19, 2020, 9:08 AM IST

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్​ఓ)పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ మరోమారు విరుచుకుపడ్డారు. చైనా చేతిలో డబ్ల్యూహెచ్​ఓ కీలుబొమ్మ అని విమర్శించారు.

చైనా నుంచి వచ్చే వారిని నిషేధించడం వల్ల అగ్రరాజ్యంలో అనేకమంది ప్రాణాలు కాపాడినట్టు ట్రంప్​ తెలపారు. తన నిర్ణయాన్ని డబ్ల్యూహెచ్​ఓ వ్యతిరేకించిందని మండిపడ్డారు.

"చైనా చేతిలో డబ్ల్యూహెచ్​ఓ కీలుబొమ్మ. చైనాకు అనుకూలంగా డబ్ల్యూహెచ్​ఓ వ్యవహరిస్తోంది. సంస్థ తన బాధ్యతను సరిగ్గా నిర్వర్తించలేదు. చైనా పర్యటకులను నేను నిషేధించినప్పుడు.. డబ్ల్యూహెచ్​ఓ వ్యతిరేకించింది. ఇది చాలా కఠిన చర్యగా పేర్కొంది. కానీ ఇప్పుడు డబ్ల్యూహెచ్​ఓ మాటలు తప్పని రుజువయ్యాయి."

--డొనాల్డ్​ ట్రంప్​, అమెరికా అధ్యక్షుడు.

మాజీ ఉపాధ్యక్షుడు, డెమొక్రాట్​ పార్టీ నుంచి అధ్యక్ష బరిలో ఉన్న జో బిడెన్​ కూడా తన నిర్ణయాన్ని వ్యతిరేకించినట్టు గుర్తు చేశారు ట్రంప్​. చైనా నుంచి వచ్చే వారిపై నిషేధం విధించడం ఎంతో ముఖ్యమని పేర్కొన్న ట్రంప్.. ఈ నిర్ణయంతో కొన్ని వేల ప్రాణాలు కాపాడినట్టు స్పష్టం చేశారు.​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.