ETV Bharat / international

ట్రంప్​పై 40లక్షల ఓట్ల తేడాతో గెలుస్తాం: బైడెన్​ - us election result process

Voters from both parties turned out in droves to pick the next president, but as they did so, they found little agreement about what that president should do. The yawning divides will threaten the next president’s ability to manage multiple crises: Daily coronavirus infections set a record this week, the economy is struggling to recover from the pandemic and many Americans are pressing for a reckoning on racial injustices.

US ELECTION LIVE UPDATES
అమెరికా అధ్యక్ష ఎన్నికలు
author img

By

Published : Nov 6, 2020, 4:08 PM IST

Updated : Nov 7, 2020, 10:38 AM IST

10:32 November 07

  • అగ్రరాజ్య తదుపరి అధినేత ఎవరన్నదానిపై క్రమంగా తొలగుతున్న అనిశ్చితి
  • అమెరికా అధ్యక్ష పీఠానికి మరింత చేరువవుతున్న జో బైడెన్‌
  • అమెరికా: ట్రంప్‌నకు సన్నగిల్లుతున్న గెలుపు అవకాశాలు
  • శ్వేత సౌధానికి ఆరు ఎలక్టోరల్‌ ఓట్ల దూరంలో బైడెన్‌
  • ఇప్పటివరకు బైడెన్‌కు 264, ట్రంప్‌నకు 214 ఎలక్టోరల్‌ ఓట్లు

జార్జియా

  • 16 ఎలక్టోరల్‌ ఓట్లు ఉన్న జార్జియాలో జో బైడెన్‌ ఆధిక్యం
  • అమెరికా: జార్జియాలో 4,020 ఓట్ల ఆధిక్యంలో జో బైడెన్‌
  • ఇప్పటివరకు జార్జియాలో 99 శాతం పూర్తయిన ఓట్ల లెక్కింపు

నెవాడా

  • 6 ఎలక్టోరల్‌ ఓట్లు ఉన్న నెవాడాలో జో బైడెన్‌ ఆధిక్యం
  • అమెరికా: నెవాడాలో 22,657 ఓట్ల ఆధిక్యంలో జో బైడెన్‌
  • ఇప్పటివరకు నెవాడాలో 87 శాతం పూర్తయిన ఓట్ల లెక్కింపు

పెన్సిల్వేనియా

  • 20 ఎలక్టోరల్ ఓట్లు ఉన్న పెన్సిల్వేనియాలోనూ బైడెన్ ఆధిక్యం
  • పెన్సిల్వేనియాలో 28,877‬ ఓట్ల ఆధిక్యంతో బైడెన్​ ముందంజ
  • ఇప్పటివరకు నెవాడాలో 99 శాతం పూర్తయిన ఓట్ల లెక్కింపు

09:43 November 07

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీతో గెలవబోతున్నట్లు డెమొక్రాట్ల అభ్యర్థి జో బైడెన్ ధీమా వ్యక్తం చేశారు. 300కుపైగా ఎలక్టోరల్ ఓట్లు గెలిచే సూచనలు కన్పిస్తున్నాయని చెప్పారు. అధికారంలోకి వచ్చిన మొదటి రోజే కొవిడ్​ కట్టడికి పకడ్బందీ ప్రణాళిక రూపొందిస్తామని స్పష్టం చేశారు.

09:40 November 07

  • ఈ ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీతో గెలవబోతున్నాం: బైడెన్‌
  • ట్రంప్‌పై 4 మిలియన్‌ ఓట్ల తేడాతో గెలుస్తున్నాం: బైడెన్‌
  • సంయమనం పాటించండి... అందరి ఓట్లు లెక్కిస్తారు: బైడెన్‌
  • రాజకీయాలనేవి సమస్యల పరిష్కారం కోసమే: బైడెన్‌
  • కరోనా నివారణకు ప్రణాళికలు తయారుచేశాం: బైడెన్‌

06:47 November 07

  • అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో చరిత్రాత్మక విజయానికి మరింత చేరువైన డెమోక్రాట్ అభ్యర్థి జోబైడెన్‌
  • నెవెడాలో ఆధిక్యాన్ని నిలబెట్టుకుంటున్న డెమోక్రాట్ అభ్యర్థి జోబైడెన్‌  జార్జియా, పెన్సిల్వేనియాలో ట్రంప్‌ని వెనక్కి నెట్టిన బైడెన్
  • గతంలో ట్రంప్ ఆధిక్యంలో ఉన్న రాష్ట్రాల్లోనూ దూసుకుపోతున్న బైడెన్
  • అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో 45 రాష్ట్రాల ఫలితాలు వెల్లడి
  • వెల్లడి కావల్సి ఉన్న నెవెడా, జార్జియా, పెన్సిల్వేనియా, అలస్కా, నార్త్‌కరోలైనా ఫలితాలు
  • నెవెడాలో 92 శాతం ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికి 20 వేల పైచిలుకు మెజారిటీలో బైడెన్
  • జార్జియాలో ఆధిక్యంలోకి వచ్చిన జో బైడెన్
  • 16 ఎలక్టోరల్ ఓట్లు గల జార్జియాలో 99 శాతం మేర ఓట్ల లెక్కింపు పూర్తి
  • జార్జియాలో ట్రంప్‌ కంటే బైడెన్ సుమారు 16వందల ఓట్లకు పైగా ముందంజ
  • పెన్సిల్వేనియాలో ఇప్పటి వరకు సుమారు13న్నర వేల ఓట్ల ఆధిక్యంలో బైడెన్
  • ఇవాళ పెన్సిల్వేనియాలో ఫలితం వెల్లడయ్యే అవకాశం
  • నార్త్‌ కరోలినాలో ఈ నెల 12 వరకు స్వీకరించనున్న  పోస్టల్‌ బ్యాలెట్లు
  • నార్త్‌ కరోలినాలో బైడెన్‌పై 76 వేల ఓట్ల తేడాతో 1.4% ఓట్ల ఆధిక్యంలో ట్రంప్‌

04:39 November 07

  • అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో  కొనసాగుతున్న ఉత్కంఠ
  • అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం దిశగా డెమెుక్రటిక్‌ అభ్యర్థి బైడెన్‌
  • 264 ఎలక్టోరల్ ఓట్లు సాధించి విజయానికి  6ఓట్ల దూరంలో నిలిచిన బైడెన్
  • ట్రంప్‌ 214 ఎలక్టోరల్ ఓట్లు సాధించిన ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్‌
  • అగ్రరాజ్యాధినేతగా నిలిచేందుకు అడుగు దూరంలో నిలిచిన బైడెన్
  • అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇప్పటి వరకూ 45 రాష్ట్రాల ఫలితాలు వెల్లడి
  • బైడెన్ విజయానికి అవసరమైన 6ఎలక్టోరల్‌ ఓట్లు
  • ఫలితాలు వెల్లడి కావాల్సి ఉన్న ఐదు రాష్ట్రాలలో మూడు చోట్ల జో ఆధిక్యం
  • మొదట ఆధిక్యంలో ఉన్న పెన్సిల్వేనియా, జార్జియాలోనూ ట్రంప్‌ను అధిగమించిన బైడెన్
  • సన్నగిల్లుతున్న ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విజయావకాశాలు

21:30 November 06

అగ్రరాజ్య అధ్యక్ష పీఠం ఎవరిని వరిస్తుందోనన్న ఉత్కంఠ ఇంకా వీడట్లేదు. ఐదు రాష్ట్రాల్లో లెక్కింపు కొనసాగుతుండటం, ఆయా స్థానాల్లో ప్రధాన అభ్యర్థులిద్దరి మధ్యా పెద్దగా అంతరం లేకపోవడంతో పోరు మరింత రసవత్తరంగా మారుతోంది. లెక్కింపు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో మూడింట ఆధిక్యంలో ఉన్నారు బైడెన్​. మరోవైపు సెనెట్‌లో బైడెన్‌ భవితవ్యం కూడా ఈ రాష్ట్రాల్లోని ఫలితాలపైనే ఆధారపడి ఉంది.

  • అమెరికా అధ్యక్ష పీఠానికి మరింత చేరువవుతున్న బైడెన్
  • ట్రంప్‌నకు సన్నగిల్లుతున్న గెలుపు అవకాశాలు
  • మొదటి నుంచి ట్రంప్ ఆధిక్యంలో ఉన్న రాష్ట్రాల్లో మారుతున్న లెక్కలు
  • పెన్సిల్వేనియా, జార్జియా,నెవాడాలో ఆధిక్యంలో ఉన్న జో బైడెన్
  • పెన్సిల్వేనియాలో 6,826 ఓట్లు,జార్జియాలో 1,098 ఓట్లు, నెవాడాలో 11,438 ఓట్ల ఆధిక్యంలో బైడెన్
  • నార్త్ కరోలినా, అలస్కాలోనే ట్రంప్ ఆధిక్యం
  • మొత్తం 5 రాష్ట్రాల్లోనూ గెలిస్తేనే ట్రంప్‌నకు అధికారం దక్కే అవకాశం
  • నెవాడా,పెన్సిల్వేనియా, జార్జియాలో ఏ ఒక్కటి గెలిచినా బైడెన్‌కే పీఠం

20:39 November 06

  • పెన్సిల్వేనియా, జార్జియాలో ఆధిక్యంలో ఉన్న బైడెన్
  • ప్రస్తుతం పెన్సిల్వేనియాలో 5,587 ఓట్ల ఆధిక్యంలో బైడెన్
  • జార్జియాలో 1,096 ఓట్ల ఆధిక్యంలో జో బైడెన్
  • నెవాడాలో మొదటి నుంచి ఆధిక్యంలోనే కొనసాగుతున్న బైడెన్
  • ప్రస్తుతం నార్త్ కరోలినా, అలస్కాలోనే ట్రంప్ ఆధిక్యం
  • మొత్తం 5 రాష్ట్రాల్లోనూ గెలిస్తేనే ట్రంప్‌నకు గెలుపు అవకాశం
  • నెవాడా, పెన్సిల్వేనియా, జార్జియాలో ఏ ఒక్కటి గెలిచినా బైడెన్‌కు దక్కనున్న పీఠం

ఇప్పటికే 264 ఎలక్టోరల్​ కాలేజీ ఓట్లతో ఉన్న డెమొక్రాట్​ అభ్యర్థి బైడెన్​కు మ్యాజిక్​ ఫిగర్​ '270' అందుకోడానికి ఆరు సీట్లే అవసరం. ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లికన్​ అభ్యర్థి ట్రంప్​ 214 సీట్లతో కొనసాగుతున్నారు.

15:44 November 06

శ్వేతసౌధానికి అడుగుదూరంలో బైడెన్​

అగ్రరాజ్యం అమెరికా అద్యక్ష పీఠం ఎవరిదన్న దానిపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. అయితే దీనిపై ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఐదు కీలక రాష్ట్రాల్లో కౌంటింగ్‌ కొనసాగుతున్న సమయంలో.. ట్రంప్​ ఆధిక్యంలో ఉన్న జార్జియాలో బైడెన్​ రేసులోకి వచ్చారు.

  • జార్జియా(16)లో తారుమారైన ఆధిక్యం
  • 917 ఓట్ల ఆధిక్యంతో బైడెన్ ముందంజ
  • జార్జియాలో విజయం సాధిస్తే బైడెన్​దే అద్యక్ష పీఠం‌
  • విజయానికి 6 ఎలక్టోరల్‌ ఓట్ల దూరంలో ఉన్న జో బైడెన్‌

విజేతను నిర్ణయించే జార్జియా..

ఇప్పటికే 264 ఎలక్టోరల్​ కాలేజీ ఓట్లతో ఉన్న డెమొక్రాట్​ అభ్యర్థి బైడెన్​కు మ్యాజిక్​ ఫిగర్​ '270' అందుకోడానికి ఆరు సీట్లే అవసరం. అయితే ప్రస్తుతం జార్జియా(16 సీట్లు) నెగ్గితే అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించనున్నారు జో బైడెన్​. ఇక్కడ ఓడితే ట్రంప్‌నకు దాదాపు విజయావకాశాలు గల్లంతైనట్లే. మిగతా నాలుగు చోట్ల ట్రంప్‌(214) గెలిచినా మ్యాజిక్‌ మార్క్​ను అందుకోలేరు.

సుప్రీం నిర్ణయం కీలకమా..!

ఒకవేళ బైడెన్ మెజార్టీ ఎలక్టోరల్‌ కాలేజీ ఓట్లతో మ్యాజిక్‌ ఫిగర్‌ను అందుకున్నా.. వెంటనే అధికారికంగా విజేతగా ప్రకటించే అవకాశాలు లేవు. ట్రంప్ న్యాయపోరాటానికి సిద్ధమవడం వల్ల తుది విజేత కోర్టులోనే తేలే అవకాశం ఉన్నట్లు విశ్లేషణలూ వెలువడుతున్నాయి.

రీకౌంటింగ్‌ జరుగుతుందా?

ట్రంప్​.. జార్జియాలో రీకౌంటింగ్‌ దిశగా వెళ్లే అవకాశాలు కన్పిస్తున్నాయి. నిబంధనల ప్రకారం గెలుపు మార్జిన్‌ 0.5శాతం, అంతకంటే తక్కువ ఉన్నప్పుడు ఓడిపోయిన అభ్యర్థి రీకౌంటింగ్‌ కోరే అవకాశం ఉంటుంది. అయితే ఫలితాలు వెలువడిన రెండు రోజుల్లోపే సదరు అభ్యర్థి పునఃలెక్కింపునకు అభ్యర్థించాలి. ఒకవేళ తాజా ఫలితాల్లో ట్రంప్ ఓడిపోతే ఆయనకు రీకౌంటింగ్‌ కోరే హక్కు ఉంటుంది.  

జార్జియా ఫలితం.. సెనెట్‌పై ప్రభావం

జార్జియాలో బైడెన్‌ గెలిస్తే సెనెట్‌లో డెమొక్రాట్ల బలం పెరుగుతుంది. అప్పుడు చట్టాలు ఆమోదించడానికి, కీలక నియామకాలు చేపట్టడానికి డెమొక్రటిక్‌ పార్టీకి ఎలాంటి అడ్డంకులు ఉండవు. ఒకవేళ జార్జియాలో ఓడిపోయి.. బైడెన్‌ అధ్యక్షుడైతే(మిగిలిన రాష్ట్రాల్లో ఎలక్టోరల్‌ ఓట్లు వస్తే) మాత్రం సెనెట్‌లో ఇబ్బందులు తప్పవనేది విశ్లేషకుల అభిప్రాయం.

మిగతా రాష్ట్రాల్లో పరిస్థితి ఇలా..

ఫలితం తేలని మిగతా నాలుగు రాష్ట్రాల్లో మూడు చోట్ల ట్రంప్‌ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. పెన్సిల్వేనియా, అలస్కా, నార్త్‌ కరోలినాలో ట్రంప్ ముందంజలో ఉండగా.. నెవడాలో మాత్రం బైడెన్‌ దూసుకెళ్తున్నారు. జార్జియా, నెవాడా డెమొక్రాట్ల వశమైతే అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్‌ గెలుపు ఖాయమైనట్లే.

Last Updated : Nov 7, 2020, 10:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.