ETV Bharat / international

కొవిడ్​-19 టీకా​ పంపిణీకి 'యునిసెఫ్'​ సన్నద్ధత

author img

By

Published : Nov 25, 2020, 6:15 AM IST

కొవిడ్​-19 వ్యాక్సిన్​ పంపిణీకి సన్నద్ధమవుతోంది ఐక్యరాజ్య సమితి పిల్లల విభాగం యునిసెఫ్​. 92 పేద, మధ్యాదాయ దేశాలకు త్వరితగతిగా టీకా అందించటమే లక్ష్యంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న 350 ప్రధాన విమానయాన సంస్థలు, రవాణా, షిప్పింగ్​ లైన్స్​తో చర్చలు చేపట్టింది. ఇందుకోసం పీఏహెచ్​ఓ, ఐఏటీఏ వంటి కీలక సంస్థలతో కలిసి పనిచేస్తోంది.

UNICEF
యునిసెఫ్

కరోనా వైరస్​ను నిర్మూలించేందుకు త్వరలోనే వ్యాక్సిన్​ అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్న క్రమంలో ప్రపంచవ్యాప్తంగా టీకా పంపిణీకి సన్నద్ధమవుతోంది ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ యునిసెఫ్​. ఇందుకోసం ప్రధాన విమానయాన సంస్థలు, రవాణా, షిప్పింగ్​ లైన్స్​ వంటి 350 అంతర్జాతీయ భాగస్వామ్యాలతో చర్చలు జరపుతోంది. టీకా కొనుగోలు, సరఫరా, పంపిణీ గతంలో ఎన్నడూ చేపట్టని భారీ కార్యక్రమంగా పేర్కొంది సంస్థ.

వ్యాక్సిన్​ పంపిణీ సన్నద్ధతలో భాగంగా గత వారమే పాన్​ అమెరికన్​ హెల్త్​ ఆర్గనైజేషన్​(పీఏహెచ్​ఓ), అంతర్జాతీయ వాయు రవాణా అసోసియేషన్​(ఐఏటీఏ)లతో సమావేశమైంది యునిసెఫ్​. 2021లో సుమారు 2 బిలియన్ల కొవిడ్​-19 టీకా డోస్​లను రవాణా చేసే అంశంపై చర్చించింది. ప్రధాన అంతర్జాతీయ విమానయాన సంస్థల సామర్థ్యం, త్వరితగతిగా, సురక్షిత రవాణాపైనా చర్చించారు. రెండు బిలియన్ల టీకా డోస్​లతో పాటు అదనంగా సముద్ర మార్గం ద్వారా 1 బిలియన్​ సిరంజిల రవాణా చేపట్టాలని సూచించింది.

" కొవిడ్​-19 వ్యాక్సిన్​ అభివృద్ధి పనులు జరుగుతున్న క్రమంలోనే టీకా త్వరితగతంగా, సురక్షితంగా పంపిణీ చేసేందుకు యునిసెఫ్​ చర్యలు చేపట్టింది. ఈ చారిత్రక, భారీ ఆపరేషన్​ కోసం తగిన రవాణా సామర్థ్యం ఉందని ఈ భాగస్వామ్యం నిర్ధరిస్తోంది. కరోనా పోరులో ముందుండి సేవలందిస్తోన్న సిబ్బందిని రక్షించుకునేందుకు వ్యక్తిగత భద్రత కిట్లు, సిరంజిలు, కొవిడ్​ వ్యాక్సిన్​ డోస్​లు పంపిణీ చేసేందుకు అందరి సహకారం అవసరం. కరోనా వారియర్స్​ను రక్షించుకున్నట్లయితే.. లక్షల మంది పిల్లలను రక్షించుకున్నట్లే. "

- ఎలేట్వా కడిల్లి, యునిసెఫ్​ సరఫరా విభాగం డైరెక్టర్​

పీఏహెచ్​ఓ, యునిసెఫ్​ల భాగస్వామ్యం 92 పేద దేశాలకు వ్యాక్సిన్​ కొనుగోలు, పంపిణీ చేపట్టే కార్యక్రమాన్ని పర్యవేక్షించనుంది. జనవరి నుంచి ఇప్పటి వరకు 190 మిలియన్​ డాలర్ల విలువైన మాస్క్​లు, గౌన్స్​, ఆక్సిజన్​ కాన్సెన్​ట్రేటర్స్​, పరీక్ష సామగ్రి వంటి వాటిని నిరుపేద దేశాలకు అందించింది.

ఇదీ చూడండి:కొవిడ్​కు అనుబంధంగా మరో రెండు వ్యాధులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.