అమెరికా వాషింగ్టన్‌లోని సియాటెల్‌లో ఓ ఆగంతుకుడు కారుతో విధ్వంసం సృష్టించాడు. నిరసనకారులపైకి వేగంగా వాహనంతో దూసుకెళ్లాడు. కారు ఢీకొని ఇద్దరు మహిళ్లలు అమాంతం గాల్లో ఎగిరిపడ్డారు. తీవ్ర గాయాలపాలయ్యారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. శనివారం జరిగిన ఈ ఘటన ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.
నిరసనకారులపైకి అకస్మాత్తుగా కారు దూసుకొచ్చినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. భయాందోళనకు గురైన వారంతా పరుగులు తీశారు.
ఇదీ చూడండి: మాంచెస్టర్‌లో వెల్లువెత్తిన జాత్యహంకార వ్యతిరేక నిరసనలు