ETV Bharat / international

60 రోజుల పాటు గ్రీన్​కార్డుల మంజూరు నిలిపేసిన అమెరికా

అమెరికాలోకి వలసలను నిలిపివేస్తున్నట్లు సంచలన ప్రకటన చేసిన అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్.. ఇప్పుడు ఎన్ని రోజుల పాటు ఈ ఆంక్షలు కొనసాగనున్నాయనే విషయంపై స్పష్టత ఇచ్చారు. 60 రోజుల పాటు కొత్త గ్రీన్​ కార్డుల మంజూరు ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు చెప్పారు.

trump
60 రోజులపాటు అమెరికాకు రావొద్దు: ట్రంప్​
author img

By

Published : Apr 22, 2020, 5:30 AM IST

Updated : Apr 22, 2020, 7:32 AM IST

కరోనా సంక్షోభం నేపథ్యంలో కొంతకాలం పాటు అగ్రరాజ్యానికి ఎవరూ వలస రాకుండా నిషేధం విధిస్తున్నట్లు మంగళవారం సంచలన ప్రకటన చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇప్పుడు 60 రోజుల పాటు కొత్త గ్రీన్​కార్డుల మంజూరును నిలిపివేస్తున్నట్లు తెలిపారు. అయితే తాత్కాలిక వీసాల ద్వారా అమెరికాకు వచ్చే వారిపై మాత్రం ఎలాంటి ఆంక్షలు ఉండబోవని స్పష్టం చేశారు ట్రంప్​.

60 రోజుల పాటు తాత్కాలిక వలసల్ని రద్దు చేసే నిర్ణయంలో భాగంగానే గ్రీన్​కార్డులను నిలిపివేస్తున్నారు. తర్వాత అమెరికా ఆర్థిక పరిస్థితిని బట్టి తదపరి నిర్ణయం ఉంటుందని ట్రంప్ పేర్కొన్నారు​. త్వరలో దీనికి సంబంధించిన ఉత్తర్వులపై సంతకం చేయనున్నట్లు ట్విట్టర్​ వేదికగా వెల్లడించారు.

అమెరికాలో ఉద్యోగాల కల్పన కోసమే వలసల్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ఇప్పటికే స్పష్టం చేశారు ట్రంప్​. అయితే గ్రీన్​కార్డుల నిలిపివేత నిర్ణయంతో ఎన్నో ఏళ్లుగా అమెరికాకు వెళ్లాలని ఎదురుచూస్తున్న వేలాది మంది భారతీయులపై ప్రభావం అధికంగా పడనుంది.

ఇదీ చూడండి: కరోనా వ్యాక్సిన్​ను అమెరికా కనిపెడుతుంది: ట్రంప్

Last Updated : Apr 22, 2020, 7:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.