అమెరికాలోని టిక్‌టాక్ ఆస్తులను ఇతరులకు విక్రయించాలని దాని మాతృసంస్థ బైట్‌డాన్స్‌ను నిర్దేశించారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇందుకు 90 రోజుల గడువు నిర్ణయిస్తూ కార్యనిర్వాహక ఆదేశాలు జారీ చేశారు.
అమెరికా జాతీయ భద్రతను దెబ్బతీసే చర్యలు బైట్‌డాన్స్ చేపట్టే అవకాశం ఉందని చెప్పేందుకు తగిన ఆధారాలు ఉన్నాయని ఈ ఆదేశాల్లో పేర్కొన్నారు. అంతేకాకుండా అమెరికాలో టిక్‌టాక్ సేకరించిన సమచారాన్ని కూడా మళ్లించాలని ట్రంప్ ఆదేశించారు.
చైనా యాప్‌లపై నిషేధం..
చైనా ఆధారిత యాప్‌లైన టిక్‌టాక్, వీచాట్‌ను దేశంలో నిషేధిస్తూ ట్రంప్ గతవారం ఆదేశాలు జారీ చేశారు. జాతీయ భద్రత, విదేశాంగ విధానం, ఆర్థిక వ్యవస్థలకు వీటి ద్వారా ప్రమాదం ఉన్న కారణంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. సెప్టెంబర్ నుంచి ఈ నిషేధం అమల్లోకి రానుంది.
ట్రంప్ ఆదేశాలను సవాలు చేస్తూ టిక్‌టాక్‌తో పాటు ఆ సంస్థ ఉద్యోగులు న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు.
ఇదీ చూడండి: టిక్‌టాక్ నిషేధంపై ఉద్యోగుల న్యాయపోరాటం!