ETV Bharat / international

ఆసుపత్రిలో ట్రంప్- కోలుకోవాలని ఆకాంక్షించిన కిమ్​

author img

By

Published : Oct 3, 2020, 11:59 AM IST

కరోనా పాజిటివ్​గా తేలిన 24 గంటల తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. సైనిక ఆసుపత్రిలో చేరారు. ఆయనకు ప్రత్యేక వైద్య బృందం చికిత్స అందిస్తోంది. ట్రంప్ దంపతులు త్వరగా కోలుకోవాలని ఉత్తర కొరియా అధినేత కిమ్​ జోంగ్ ఉన్ ఆకాంక్షించారు.

trump kim
ట్రంప్ కిమ్​

కరోనా వైరస్‌ బారిన పడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆస్పత్రిలో చేరారు. వాషింగ్టన్‌ శివారు ప్రాంతం బేథెస్డాలో ఉన్న వాల్టర్‌ రీడ్‌ మిలిటరీ ఆస్పత్రిలో ఆయనకు ప్రత్యేక వైద్య బృందం చికిత్స అందిస్తోంది.

తనకు వైరస్‌ సోకినట్లు ప్రకటించినప్పటి నుంచి శ్వేతసౌధంలోనే క్వారంటైన్‌లో ఉన్న ఆయన.. వైద్యుల సూచన మేరకు శుక్రవారం సాయంత్రం ఆస్పత్రిలో చేరేందుకు అంగీకరించారు. మాస్కు ధరించి హెలికాప్టర్‌లో ఆస్పత్రికి చేరుకున్నారు.

అక్కడి నుంచే ఆయన విధులు నిర్వర్తించనున్నట్లు అధికారులు ప్రకటించారు. ప్రస్తుతానికి ఎన్నికల ప్రచారానికి పూర్తిగా దూరంగా ఉండే అవకాశం ఉందన్నారు. వర్చువల్​గా ప్రచారాల్లో పాల్గొంటారని సమాచారం.

నేను ఆరోగ్యంగానే ఉన్నా..

తాను, ప్రథమ మహిళ మెలనియా ట్రంప్‌ ఆరోగ్యంగానే ఉన్నట్లు ట్రంప్‌ తెలిపారు. వాల్టర్‌ రీడ్‌కు చేరుకునే ముందు 18 సెకన్ల నిడివి గల ఓ వీడియోను ట్వీట్‌ చేశారు.

"నాకు మద్దతుగా నిలుస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. నేను వాల్టర్ రీడ్‌ ఆస్పత్రికి వెళ్తున్నాను. నాకు తెలిసి నేను బాగానే ఉన్నాను. అయినా, అన్నీ సవ్యంగా ఉండాలనే మేం ఆస్పత్రికి వెళ్తున్నాం. ప్రథమ మహిళ కూడా బాగానే ఉన్నారు. అందరికీ ధన్యవాదాలు. నేను ఇది ఎప్పటికీ మర్చిపోలేను"

- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు

ప్రథమ మహిళకు స్వల్ప తలనొప్పి, దగ్గు మినహా పెద్ద లక్షణాలేమీ లేవని శ్వేతసౌధం అధికారులు తెలిపారు. మిగతా కుటుంబ సభ్యులందరికీ నెగటివ్‌ వచ్చినట్లు వెల్లడించారు.

చికిత్స..

అధ్యక్షుడికి ముందు జాగ్రత్తగా రెజెనెరాన్స్‌కు చెందిన 8 గ్రాముల డోసు గల పాలీక్లోనల్‌ యాంటీబాడీ కాక్‌టెయిల్‌ అందించారు వైద్యులు. ఈ ఔషధం ఇంకా ప్రయోగాత్మక దశలోనే ఉంది. దీనితో పాటు జింక్‌, విటమిన్‌-డి, ఫామోనిటిడైన్‌, ఆస్పిరిన్‌, మెలటోనిన్‌ తీసుకుంటున్నారు.

ట్రంప్ కోలుకోవాలి: కిమ్​

ట్రంప్‌ దంపతులు కరోనా నుంచి త్వరగా బయటపడాలంటూ ప్రపంచవ్యాప్తంగా సానుభూతి వ్యక్తం అవుతోంది. తాజాగా ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ట్రంప్‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

"ట్రంప్‌ దంపతుల ఆరోగ్యం పట్ల కిమ్‌ సానుభూతి వ్యక్తం చేశారు. వీలైనంత త్వరగా వాళ్లు దీని నుంచి బయటపడతారని ఆకాంక్షించారు. త్వరలో వారు కరోనాను కచ్చితంగా జయిస్తారన్నారు" అని అక్కడి అధికారిక మీడియా కేసీఎన్‌ఏ ప్రకటన విడుదల చేసింది.

ఇదీ చూడండి: ట్రంప్ త్వరగా కోలుకోవాలని ప్రపంచ నేతల ఆకాంక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.