ETV Bharat / international

అమెరికాపై కరోనా పంజా- ఆస్పత్రుల్లో టెంట్ల కింద చికిత్స

డెల్టా వేరియంట్ల ఉద్ధృతితో ప్రపంచ దేశాల్లో మళ్లీ పంజా విసురుతోంది కరోనా. అమెరికాలో రోజుకు లక్ష మందికిపైగా వైరస్​ బారినపడుతున్నారు. ఈ క్రమంలో ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. హ్యూస్టన్​లోని ప్రభుత్వ ఆస్పత్రుల బయట టెంట్లు వేసి రోగులకు చికిత్స అందిస్తున్న తీరు అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది. మరోవైపు.. చైనాలోనూ వైరస్​ వేగంగా వ్యాపిస్తోంది.

COVID-19
కరోనా వైరస్​
author img

By

Published : Aug 10, 2021, 5:12 PM IST

కరోనా మహమ్మారి కొత్త కొత్త రూపాలతో ప్రపంచవ్యాప్తపై మళ్లీ పడగవిప్పుతోంది. వ్యాక్సిన్ల రాకతో వైరస్​ అంతానికి మార్గం సుగమమైందని అనుకున్నా... డెల్టా, డెల్టా ప్లస్​ వంటి వేరియంట్లతో పంజా విసురుతోంది. అగ్రరాజ్యం అమెరికాలో రోజుకు లక్షకుపైగా కొత్త కేసులు నమోదవుతుండటమే ఇందుకు నిదర్శనం.

టెక్సాస్​ ఆసుపత్రులు ఫుల్​- టెంట్లు ఏర్పాటు

కొవిడ్​-19 థర్డ్​వేవ్​ ఉద్ధృతితో ఇతర రాష్ట్రాల సాయం కోరారు టెక్సాస్​ గవర్నర్​ గ్రేగ్​ అబాట్​. హ్యూస్టన్​లోని రెండు ప్రభుత్వ ఆసుపత్రులు కరోనా రోగులతో నిండిన క్రమంలో ఆరుబయట టెంట్లు వేసి పడకలు ఏర్పాటు చేశాయి. 2000 చదరపు అడుగుల్లో టెంట్లు వేసి పడకలు ఏర్పాటు చేసింది హర్రీస్​ హెల్త్​ సిస్టమ్స్​ అండ్​ లిన్​డన్​ బీ. జాన్సన్​ ఆసుపత్రి.

ప్రైవేటు ఆసుపత్రులు తగిన ఏర్పాట్లు చేస్తున్నాయి. తమ సిబ్బందికి వ్యాక్సిన్​ ఇస్తూ.. సేవల్లోకి తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇతర రాష్ట్రాలు సాయం చేయాలని కోరారు గ్రేగ్​. మంగళవారం నుంచి విద్యార్థులు,

ఉపాధ్యాయులు, సిబ్బంది మాస్కులు తప్పనిసరిగా ధరించాలని డల్లాస్​ స్కూల్​ ప్రకటించింది. హ్యూస్టన్​ జిల్లా స్కూల్​ ఇప్పటికే మాస్క్​ తప్పనిసరి చేసింది.

COVID-19
హ్యూస్టన్​లోని ఓ పాఠశాలలో ఏర్పాట్లు

చైనాలో వైరస్​ ఉద్ధృతి..

కరోనా వైరస్​ను తొలుత విజయవంతంగా కట్టడి చేయగలిగిన చైనానూ కొత్త కేసులు కలవరపెడుతున్నాయి. మంగళవారం కొత్తగా 180 మందికి వైరస్​ పాజిటివ్​గా తేలింది. అందులో 108 స్థానికంగా వ్యాప్తి చెందినవిగా గుర్తించారు అధికారులు. గత జులై నుంచి ఒక్కరోజు కేసుల్లో ఇదే అత్యధికం. కొత్తగా వైరస్​ బారిన పడిన వారిలో 35 మంది విదేశీయులని, మరో 38 మందిలో లక్షణాలు లేవని జాతీయ ఆరోగ్య కమిషన్​ తెలిపింది.

నాన్​జింగ్​ విమానాశ్రయంలో డెల్టా కేసులు వెలుగు చూసిన తర్వాత ఇతర నగరాలకు వ్యాపించింది వైరస్​. ప్రస్తుతానికి హుబే రాష్ట్రంలో 68 మంది కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్నారు. అందులో 58 మందికి స్థానికంగా వ్యాపించినట్లు అధికారులు తెలిపారు. ఈ రాష్ట్రంలో మరో 80 లక్షణాలు లేని కేసులు ఉన్నాయి. వుహాన్​ నగరంలో వైరస్​ వ్యాప్తిని గుర్తించేందుకు పెద్ద ఎత్తున 12 మిలియన్ల మందికి పరీక్షలు చేపడుతోంది చైనా.

టీకా తీసుకోకుంటే రైలు ఎక్కలేరు..

కొవిడ్​-19 వ్యాక్సిన్​ తీసుకునేందుకు ప్రజలు వెనకడుగు వేస్తున్న క్రమంలో కీలక నిర్ణయం తీసుకుంది పాకిస్థాన్​ ప్రభుత్వం. టీకా తీసుకోని వారు అక్టోబర్​ నుంచి రైలు ప్రయాణం చేయకుండా నిషేధం విధించింది. కరోనా వైరస్​పై ఉన్నతస్థాయి నిపుణుల కమిటీ ఆందోళన వ్యక్తం చేసిన క్రమంలో నేషనల్​ కమాండ్​ అండ్​ ఆపరేషన్​ సెంటర్​ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

దేశీయ విమాన ప్రయాణాలపై ఈ నిషేధం ఆగస్టు నుంచి అమలులోకి వచ్చింది. గత ఫిబ్రవరి నుంచి వ్యాక్సినేషన్​ను ప్రారంభించింది పాకిస్థాన్​. ఇప్పటి వరకు 37 మిలియన్ల మందికి టీకా పంపిణీ చేశారు.

ఇతర దేశాల్లో కరోనా వైరస్​ ఉద్ధృతి ఇలా..

  • ఇరాన్​: అగ్రరాజ్యం తర్వాత వైరస్​ ఉద్ధృతి అధికంగా ఉంది ఇరాన్​లోనే. ఆంక్షల సడలింపు, ఆర్థిక కార్యకలాపాలు పుంజుకున్న నేపథ్యంలో వైరస్​ పంజా విసురుతోంది. సోమవారం ఒక్కరోజే ఏకంగా 40వేలకుపైగా కొత్త కేసులు బయటపడ్డాయి. 588 మంది మరణించారు. 26 వేల మంది వైరస్​ను జయించారు.
  • బ్రిటన్​: డెల్టా వేరియంట్​ వ్యాప్తి బ్రిటన్​లో అధికంగా ఉంది. దీంతో దేశవ్యాప్తంగా ఒక్కరోజే 25వేలకుపైగా కొత్త కేసులు వెలుగు చూశాయి. 37 మంది ప్రాణాలు కోల్పోయారు. 25వేల మంది వైరస్​ నుంచి కోలుకున్నారు.
  • టర్కీ: దేశవ్యాప్తంగా ఆంక్షలు సడలించిన క్రమంలో వైరస్​ మళ్లీ పుంజుకుంటోంది. సోమవారం కొత్తగా 23వేల కేసులు నమోదయ్యాయి. 117 మంది మరణించారు.
  • రష్యా: కరోనా మహమ్మారి కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపించినా.. కొత్త కేసులు 20వేల లోపునకు దిగటం లేదు. సోమవారం కొత్తగా 22వేల మందికి వైరస్​ సోకింది. 769 మంది మరణించారు.
  • ఇండోనేసియా: కరోనా కేసులు అదుపులోకి వచ్చినా.. మరణాలు తగ్గటం లేదు. సోమవారం 20వేల కేసులు వెలుగు చూడగా.. 1,475 మంది ప్రాణాలు కోల్పోవటం ఆందోళన కలిగిస్తోంది. మరో 44 వేల మంది వైరస్​ను జయించారు.

ఇదీ చూడండి: కరోనా వేరియంట్ల విజృంభణ- 5లక్షలకుపైగా కొత్త కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.