ETV Bharat / international

భువికి చేరి చరిత్ర సృష్టించిన 'స్పేస్​ఎక్స్​' - నాసా

స్పేస్​ఎక్స్​ చరిత్ర సృష్టించింది. డ్రాగన్‌ వ్యోమనౌక.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌) నుంచి ఇద్దరు వ్యోమగాములను విజయవంతంగా భూమికి తీసుకొచ్చింది. పశ్చిమ ఫ్లోరిడాలోని పెన్సాకోలా తీరం సమీపంలో దిగింది. ఇలా సముద్ర జలాలపై దిగడం 45 ఏళ్లల్లో ఇదే తొలిసారి.

Spacex Astronauts splashed down, marking the first splashdown of an American crew spacecraft in 45 years.
భూమికి తిరిగొచ్చి చరిత్ర సృష్టించిన 'స్పెస్​ఎక్స్​'
author img

By

Published : Aug 3, 2020, 7:06 AM IST

Updated : Aug 3, 2020, 7:17 AM IST

అమెరికాకు చెందిన 'స్పేస్‌ఎక్స్' మరో చరిత్ర సృష్టించింది. ఆ సంస్థ రూపొందించిన డ్రాగన్‌ వ్యోమనౌక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌) నుంచి ఇద్దరు వ్యోమగాములను విజయవంతంగా భూమికి తీసుకొచ్చింది. తద్వారా ఆ ఘనత సాధించిన తొలి ప్రైవేటు వ్యోమనౌకగా గుర్తింపు పొందింది. ఆదివారం అర్ధరాత్రి 12.18 గంటలకు డ్రాగన్‌.. నిర్దేశించిన విధంగా పశ్చిమ ఫ్లోరిడాలోని పెన్సాకోలా (మెక్సికో అగాథం) తీరానికి చేరువలో పారాచూట్ల సాయంతో సాఫీగా దిగింది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా) వ్యోమగాములు ఇలా సముద్ర జలాలపై దిగడం.. 45 ఏళ్లలో ఇదే మొదటిసారి.

తొలి ప్రైవేటు సంస్థ

డ్రాగన్‌ వ్యోమనౌక మే నెల 30న ఫ్లోరిడా నుంచి బయలుదేరిన సంగతి తెలిసిందే. తద్వారా మానవ సహిత యాత్రలను నిర్వహించే సామర్థ్యం కలిగిన తొలి ప్రైవేటు సంస్థగా స్పేస్‌ఎక్స్‌ గుర్తింపు పొందింది. నాటి యాత్రలో నాసా వ్యోమగాములు డగ్‌ హర్లీ, బాబ్‌ బెంకెన్‌లను ఐఎస్‌ఎస్‌కు విజయవంతంగా తీసుకెళ్లిన డ్రాగన్‌.. రెండు నెలల తర్వాత తిరిగి వారిని భూమికి తీసుకొచ్చింది. దక్షిణాఫ్రికాకు 430 కిలోమీటర్ల ఎత్తులో ఉండగానే ఐఎస్‌ఎస్‌ నుంచి ఈ వ్యోమనౌక విడిపోయింది. ఇందుకు సూచికగా అంతరిక్ష కేంద్రం కమాండర్‌ క్రిస్‌ కాసిడీ ఒక గంటను కొట్టారు. కక్ష్యలో ఉన్నప్పుడు డ్రాగన్‌ క్యాప్స్యూల్‌ వేగం గంటకు 28 వేల కిలోమీటర్లుగా ఉంది. భూవాతావరణంలో చేరే సమయానికి దాన్ని 560 కిలోమీటర్లకు తగ్గించుకుంది. సముద్రంలో దిగే సమయానికి దాని వేగం గంటకు 24 కిలోమీటర్లకు పరిమితం చేసుకుంది. భూ వాతావరణంలో ప్రవేశించే సమయంలో గాలి రాపిడి వల్ల తలెత్తిన 1900 డిగ్రీల సెల్సియస్‌ వేడిని ఇది తట్టుకుంది.

దశాబ్దం తర్వాత..

2011లో స్పేస్‌ షటిల్‌ కార్యక్రమానికి ముగింపు పలికినప్పటి నుంచి అమెరికా వద్ద మానవసహిత అంతరిక్ష యాత్రలు నిర్వహించే సామర్థ్యం లేదు. ఈ యాత్రల కోసం రష్యాపై ఆధారపడుతోంది. ఐఎస్‌ఎస్‌కు వ్యోమగాములను తరలించి, వెనక్కి తీసుకొచ్చే బాధ్యతను ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్‌, బోయింగ్‌ సంస్థకు నాసా అప్పగించింది. బోయింగ్‌ రూపొందించిన 'స్టార్‌లైనర్'’ క్యాప్స్యూల్‌లో సాఫ్ట్‌వేర్‌ సమస్యలు తలెత్తాయి. మానవసహిత యాత్ర చేపట్టడానికి దానికి మరో ఏడాది పట్టొచ్చు. సెప్టెంబర్‌లో తన రెండో యాత్రను చేపట్టడానికి 'డ్రాగన్' సిద్ధమవుతోంది.

బోయింగ్‌ను తోసిరాజని ఈ రేసులో ముందున్న స్పేస్‌ఎక్స్‌ సంస్థ.. తాజా తిరుగు ప్రయాణంలో ఐఎస్‌ఎస్‌లో ఉన్న ఒక అమెరికా జెండాను భూమికి తీసుకొచ్చింది. 2011లో అమెరికా చివరిసారిగా చేపట్టిన స్పేస్‌ షటిల్‌ యాత్రలో హర్లీ, ఇతర వ్యోమగాములు దాన్ని అంతరిక్ష కేంద్రానికి తీసుకెళ్లారు.

ఘన స్వాగతం

సముద్ర జలాలపై సాఫీగా దిగిన డ్రాగన్‌ వద్దకు వెంటనే రెండు స్పీడ్‌ బోట్లు చేరుకున్నాయి. 40 మంది సిబ్బందితో కూడిన మరో నౌక సముద్రం నుంచి డ్రాగన్‌ను తన డెక్‌పైకి తీసుకొచ్చింది. అందులోని వ్యోమగాములను బయటకు తీసి, ఘనంగా స్వాగతం చెప్పారు. 'భూ గ్రహానికి తిరిగి స్వాగతం. స్పేస్‌ఎక్స్‌ వ్యోమనౌకలో ప్రయాణించినందుకు కృతజ్ఞతలు' అని మిషన్‌ కంట్రోల్‌ అధికారులు వ్యాఖ్యానించారు. ఈ కేంద్రం నుంచి స్పేస్‌ఎక్స్‌ అధినేత ఎలాన్‌ మస్క్‌ డ్రాగన్‌ తిరుగు ప్రయాణాన్ని పర్యవేక్షించారు. అనంతరం వ్యోమగాములకు వైద్య పరీక్షలు నిర్వహించారు. నాసా వ్యోమగాములు చివరిసారిగా.. 1975 జులై 24న ఇలా సముద్ర జలాల్లో దిగారు. అమెరికా, సోవియట్‌ యూనియన్‌లు ఉమ్మడిగా నిర్వహించిన 'అపోలో-సోయజ్‌ యాత్ర'లో భాగంగా అది జరిగింది.

ఇదీ చూడండి:- కదలకుండా 2 గంటలు.. రాత్రికి రాత్రి స్టార్

Last Updated : Aug 3, 2020, 7:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.