ఇరాన్‌పై దాడులు చేయాలని ఆదేశించకుండా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను నియంత్రించే తీర్మానానికి కాంగ్రెస్ ఆమోదం తెలిపింది. ఇప్పటికే ఎగువసభ ఆమోదించిన ఈ తీర్మానానికి బుధవారం దిగువసభ పచ్చజెండా ఊపింది. మొత్తం 227 మంది సభ్యుల్లో 186 మంది అనుకూలంగా ఓటేశారు.
ఈ తీర్మానాన్ని డొనాల్డ్ ట్రంప్ తన విశేషాధికారాలు ఉపయోగించి వీటో చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
జనవరి 3న ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంపై అమెరికా వైమానిక దాడులు చేసింది. ఈ ఘటనలో ఇరాన్ టాప్ కమాండర్ ఖాసీం సులేమానీ సహా ఎనిమిది మంది మృతి చెందారు. ఈ ఘటనతో ఇరు దేశాలు మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి.
ఇదీ చూడండి:సీఎం పదవిపై వ్యామోహం లేదన్న సూపర్‌స్టార్ రజనీకాంత్