ETV Bharat / international

కంచుకోటల్లో ఎదురుగాలి- ట్రంప్​కు ఓటమి తప్పదా? - donald trump

అమెరికాలో జాతివిద్వేషానికి వ్యతిరేకంగా మొదలైన నిరసనలు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాలిట శాపంగా మారాయి. నాలుగు సంవత్సరాల క్రితం పట్టం కట్టిన ఓటర్లే ఇప్పుడు ట్రంప్​కు వ్యతిరేకంగా మారుతున్నట్లు తెలుస్తోంది. బలమైన ఓటర్ వర్గం ఉన్న గ్రామీణ ప్రాంతాల్లోనూ ఈ నిరసనలు జరుగుతుండటం ట్రంప్ వర్గానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.

Protests in Trump country test his hold in rural white areas
ట్రంప్ గద్దె దిగడం ఖాయమా?
author img

By

Published : Jun 25, 2020, 6:13 PM IST

2016 అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ బలాలే ఇప్పుడు బలహీనతలుగా మారబోతున్నాయా? రిపబ్లికన్ పార్టీని గెలిపించిన ఓటర్లే ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా జట్టుకడుతున్నారా? తన బలమైన గ్రామీణ, శ్వేతజాతీయుల ఓటు బ్యాంకులో చీలికలు వస్తున్నాయా? జాతివిద్వేషానికి వ్యతిరేకంగా దేశంలో మొదలైన నిరసనలు ట్రంప్ మరోసారి అధ్యక్ష పీఠాన్ని అధిరోహించకుండా అడ్డుపడుతున్నాయా?

వీటన్నింటికీ పూర్తిగా అవునని సమాధానం రాకపోయినా... చాలా రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులను బట్టి కాదని మాత్రం బదులివ్వలేకపోతున్నారు విశ్లేషకులు. అసలు ఆ పరిస్థితులు ఏంటి? ట్రంప్ ఓటరు వర్గం పంథా మార్చుకోవడానికి కారణాలేంటి?

గెలిపించిన వారే ప్రతికూలంగా!

డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికవడంలో గ్రామీణ ప్రజలదే ప్రధాన పాత్ర. అందులోనూ శ్వేతజాతీయుల ఓట్లే కీలకంగా వ్యవహరించాయి. కానీ ఇటీవలి కాలంలో అమెరికాలో శ్వేతజాతీయుల అహంకార వైఖరికి వ్యతిరేకంగా అమెరికావ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. నల్లజాతీయులతో పాటు శ్వేతజాతీయులు సైతం ఈ ఆందోళనల్లో పాల్గొంటున్నారు.

శ్వేతజాతి సానుభూతిదారుడిగా ట్రంప్​కు పేరుంది. ఇప్పుడు ఇదే ఆయనకు ప్రతికూలాంశంగా మారే ప్రమాదం ఉంది.

ట్రంప్ 'అడ్డా'ల్లోనూ..!

పట్టణాలతో పాటు ట్రంప్ ప్రధాన బలమైన మారుమూల గ్రామాల్లోనూ ఈ నిరసనలు జరుగుతుండడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. శ్వేతజాతీయులు ఎక్కువగా ఉన్న చిన్నచిన్న గ్రామాల్లోనూ ఈ ఆందోళనలు జరగడం ట్రంప్​ను కలవరపెడుతోంది. అధ్యక్ష పీఠాన్ని అధిరోహించడానికి ఉపయోగపడిన వీరి ఓట్లపై నిరసనల ప్రభావం ఏ మేరకు పడుతుందన్న విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

రిపబ్లికన్ పార్టీ ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనూ ఆందోళనలు ఉద్ధృతంగా సాగుతున్నాయి. మిషిగన్, ఒహాయో, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్​లోని దాదాపు 200 ప్రదేశాల్లో నిరసనలు జరిగాయి. 20 వేల కన్నా తక్కువ జనాభా ఉన్న నగరాలు సైతం జాత్యహంకార వ్యతిరేక ఆందోళనలతో అట్టుడికిపోయాయి.

ఈ పరిస్థితుల్లో ఆయా నగరాల్లో ఉన్న తెల్ల ఓటర్లను కాపాడుకోవడం ట్రంప్​కు సవాల్​గా మారుతోంది. ఈ ఓటర్లను కాపాడుకోలేకపోతే మధ్యశ్రేణి పట్టణాల్లో మద్దతు క్రమంగా బలహీనపడటం ఖాయంగా కనిపిస్తోంది.

"మిషిగన్, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్, ఒహాయో రాష్ట్రాల్లో గ్రామీణ, చిన్న పట్టణాల్లోని ఓటర్లను.. ప్రత్యేకించి తెల్ల జాతీయులు, కార్మిక వర్గ ఓటర్లను కాపాడుకోలేకపోతే రాబోయే ఎన్నికల్లో అధ్యక్షుడు ట్రంప్ ఎలా గెలుస్తారనేది తెలియడం లేదు."

-టెర్రి మడొన్నా, సెంటర్​ ఫర్ పబ్లిక్ అఫైర్స్ డైరెక్టర్, ఫ్రాంక్లిన్ & మార్షల్ కాలేజీ, పెన్సిల్వేనియా

అప్పుడే అలా గట్టెక్కారు..

2016 ఎన్నికలో పెన్సిల్వేనియాలో అధ్యక్షుడు ట్రంప్ కేవలం 44 వేల ఓట్ల మెజారిటీ సాధించారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు, కార్మికులు, శ్వేతజాతీయులు ఈ మెజారిటీలో కీలక భాగస్వామ్యం కలిగి ఉన్నారు. మిషిగన్, విస్కాన్సిన్​లోనూ ఇదే విధంగా స్వల్ప తేడాతో గెలుపొందారు. ఒహాయోలో మాత్రం సునాయాస విజయం సాధించారు.

నిరుద్యోగం తీవ్ర స్థాయిలో ఉన్న వెక్స్​ఫర్డ్ కౌంటీని 2016 ఎన్నికల్లో ట్రంప్ 65శాతం ఓట్లతో చేజిక్కించుకున్నారు. గ్రాండ్ ట్రావెర్స్ కౌంటీలో ట్రంప్ స్వల్ప తేడాతో గట్టెక్కారు. ట్రంప్ 65 శాతం ఓట్లు గెలుచుకున్న ఒహాయోలోని మౌంట్ వెర్నన్​లో ఇటీవల ​ప్రత్యర్థుల బెదిరింపులను లెక్కచేయకుండా ఫ్లాయిడ్​ నిరసన ర్యాలీల్లో పాల్గొన్నారు ప్రజలు.

వీటితో పాటు మాకోంబ్, ఒహాయోలోని పోర్టేజ్, మహోనింగ్​, పెన్సిల్వేనియాలోని లుజెర్నీ కౌంటీలు సైతం ఎన్నికల రణక్షేత్రాలుగా మారాయి. 2012లో బరాక్ ఒబామాకు పట్టం కట్టిన ఈ ప్రాంతాలు 2016 ఎన్నికల్లో ట్రంప్​వైపు మొగ్గుచూపాయి. ప్రస్తుతం ఈ నాలుగు కౌంటీల్లో వందలాది నిరసనలు జరుగుతుండటం ట్రంప్ వర్గాన్ని కలవరపెడుతోంది.

పరిస్థితి తారుమారు

ప్రస్తుతం ట్రంప్ ఎలక్షన్ ప్రచారం ప్రధానంగా ఆన్​లైన్​ ద్వారా సాగుతోంది. శ్వేతజాతీయులతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని కొత్త ఓటర్ల లక్ష్యంగా క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. డెమొక్రటిక్ నేత జో బిడెన్​కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు.

అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికలో ప్రధాన పాత్ర పోషించిన ప్రాంతాల్లో నిరసనలపై రిపబ్లికన్ ప్రతినిధులు ప్రత్యక్షంగా స్పందించడం లేదు. అయితే 'జార్జి ఫ్లాయిడ్ మృతి పట్ల అధ్యక్షుడు ట్రంప్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారని, దేశవ్యాప్తంగా అల్లర్లు, అన్యాయాలతో జీవించడాన్ని అమెరికన్లు కోరుకోరని' ట్రంప్ క్యాంపెయిన్ ప్రతినిధి టిమ్ ముర్తాగ్ చెబుతున్నారు.

డెమొక్రటిక్ పార్టీకి పూర్వ వైభవం!

కాలేజీ డిగ్రీ కూడా లేని శ్వేతజాతీయులే ట్రంప్​ ప్రధాన మద్దతుదారులు. వీరి బలం ఇప్పటికి కూడా ట్రంప్​కు ఉంది. అయితే నాలుగు సంవత్సరాల క్రితంతో పోలిస్తే ఈ సంఖ్య తగ్గిందని పోల్స్ అంచనా వేస్తున్నాయి. అప్పట్లో డెమొక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్​కు అప్పుడు మద్దతివ్వని వారు... ప్రస్తుత ప్రత్యర్థి జో బిడెన్​కు మాత్రం జైకొట్టే అవకాశం ఉంది.

అయితే ట్రంప్ బలంగా ఉన్న గ్రామీణ కౌంటీలను ప్రత్యర్థి బిడెన్ పూర్తిగా గెలుచుకోలేకపోయినా.. ఆయా రాష్ట్రాల్లో రిపబ్లికన్ ఓట్లను గణనీయంగా తగ్గించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో డెమొక్రటిక్ పార్టీ పునర్​వైభవాన్ని సాధించవచ్చని చెబుతున్నారు.

ఈ పరిస్థితుల్లో అధ్యక్షుడిగా మరోసారి ఎన్నిక కాకుండానే ట్రంప్ నిష్క్రమిస్తారా? ఈ పరిస్థితులన్నీ తలకిందులు చేసి మరోసారి అగ్రరాజ్య పీఠాన్ని అధిరోహిస్తారా? అనే విషయం ఈ ఏడాది చివరికే తెలిసేది.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.