ETV Bharat / international

ఆ ప్రవాస భారతీయుల సమస్యపై బైడెన్​ చర్చ!

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. నాన్​ ఇమ్మిగ్రెంట్​ వీసాదారుల పిల్లల అంశంపై చర్చించనున్నట్లు శ్వేతసౌధం ప్రకటించింది. తల్లిదండ్రులు ఏళ్ల తరబడి గ్రీన్​కార్డు కోసం ఎదురుచూస్తున్న క్రమంలో వారి పిల్లలు డిపెండెంట్ల హోదా కోల్పోతున్నారు. ఫలితంగా అనేకమంది భారతీయుల పిల్లలు.. దేశాన్ని వీడాలేమోనని భయపడుతున్నారు. ఈ క్రమంలో శ్వేతసౌధం ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.

biden, president
బైడెన్, అమెరికా అధ్యక్షుడు
author img

By

Published : Aug 6, 2021, 8:01 AM IST

హెచ్​-1బీ సహా దీర్ఘకాల వలసదారులపై ఆధారపడుతున్న వారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ 'డాక్యుమెంటెడ్​ డ్రీమర్స్​' సమస్యపై బైడెన్​ చర్చించనున్నట్టు శ్వేతసౌధం ప్రకటించింది.

అమెరికాలో దీర్ఘకాలంగా వలసదారుల వీసాతో నివాసముంటున్న వారిపై ఆధారపడుతున్న పిల్లలను 'డాక్యుమెంటెడ్​ డ్రీమర్స్​' అని అంటారు. అమెరికా చట్టాల ప్రకారం.. పిల్లలు 21ఏళ్లు దాటిన అనంతరం.. వారిని డిపెండెంట్లుగా పరిగణించకూడదు. ఫలితంగా తాము తిరిగి వెళ్లిపోవాలేమోనని అనేకమంది ప్రవాస భారతీయుల పిల్లలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వీరిలో చాలామంది తల్లిదండ్రులు.. అగ్రరాజ్యంలో శాశ్వత నివాసం కోసం ఇచ్చే గ్రీన్​కోర్డు కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నారు. తాజాగా.. ఈ సమస్యను పరిష్కరించే విధంగా చర్చలు జరిపేందుకు బైడెన్​ సిద్ధంగా ఉన్నారని శ్వేతసౌధం మీడియా కార్యదర్శి జెన్​ సఖి వెల్లడించారు. అయితే బైడెన్​ ఎప్పుడు చర్చలు జరుపుతారనే అంశంపై స్పష్టత లేదని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:సోషల్ మీడియాపై బైడెన్ ఫైర్.. ప్రజల్ని చంపేస్తోందంటూ..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.